ఇదివరకూ చాలా సినిమాలు చేసిన ఒక్కసినిమాతో హిట్టు పడితే హీరోలు ఓవర్ నైట్ స్టార్లు అవుతారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు..దర్శకులు..నటీనటులు ఎవరైనా అంతే, అదేవిధంగా సింగర్లు కూడా. ఇదివరకు కూడా సినిమాలకు పాటలు పాడినప్పటికీ ఒక్క పాటతో ఓవర్ నైట్ అందరికీ పరిచయం అవుతారు. ఇప్పుడు పుష్ప ఐటెం సాంగ్ తో పాపులర్ అయిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ కూడా ఇది వరకు సినిమాలకు పాటలు పాడారు.
singer indravathi chowhan
ఇంద్రావతి ఎవరో కాదు..మొదట న్యూస్ చానల్ ద్వారా జనాలకు పరిచయమై ప్రస్తుతం సింగర్ గా, నటిగా టాలీవుడ్ లో రాణిస్తున్న మంగ్లీకి స్వయానా సోదరి అవుతుంది. ఇక ఇంద్రావతి గతంలో బోల్ బేబీ బోల్ పాటల కార్యక్రమంలోనూ తన పాటలతో ఆకట్టుకుంది. అంతే కాకుండా జార్జిరెడ్డి సినిమాలో కూడా ఓ పాట పాడింది. అయితే ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ సుకుమార్ అవకాశం ఇవ్వడంతో పుష్పలో ఐటెం పాట పాడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది.
Advertisement
Advertisement
also read : జంటలతో టీఆర్పీ…ఢీ 14 ఎంట్రీతో కొనసాగనున్న లవ్ ట్రాక్…!
ఇంద్రావతి తన హస్కీ వాయిస్ పాడిన ఊ అంటావా మామా ఊఊ అంటావా పాట శ్రోతలను మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాట చివరిలో ఇంద్రావతి తన ఎక్స్ ప్రెషన్ లతో కూడా ఆకట్టుకోవడం కూడా పాటకు మరింత ప్లస్ గా మారింది. ఇక ఈ పాటతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇంద్రావతి మంగ్లీకి తగ్గ సోదరి అని ప్రూవ్ చేసుకుంది. మరి ఈ సినిమా తరవాత ఇంద్రావతికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.