ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్ కమిన్స్ వంటి వాళ్ళను 20 కోట్ల కి పైగా పెట్టి కొన్నారు. యూపీ కి చెందిన సమీర్ రిజ్వీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 8.4 కోట్ల రూపాయల ని పెట్టింది. ఇది ఇలా ఉంటే జార్ఖండ్ కి చెందిన కుమార్ కుశాగ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ 7.20 కోట్లని ఖర్చు చేసింది. జార్ఖండ్ కి చెందిన రాబిన్ మించ్ అనే కుర్రాడి కోసం చెన్నై, ముంబై, సన్రైజర్స్ అలానే గుజరాత్ వంటి ఫ్రాంచైజ్ లు అన్నీ కూడా పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకి కొనుగోలు చేసింది.
Advertisement
ఇండియన్ పోలార్డ్ గా ఇతని కి గుర్తింపు ఉంది. అంతకుమించి ధర పలికేదే కానీ వేలం చివర్లో అతని పేరు రావడంతో అప్పటికే ఫ్రాంచైజ్ ల దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది లిమిట్ దాటేవరకు కూడా అతని కోసం ట్రై చేశారు సన్రైజర్స్ దగ్గర 3.4 కోట్లు ఉన్నాయి అంతవరకు వేలంలో వుంది. లిమిట్ అయిపోవడంతో ఏమీ చేయలేక పోయారు. 3.6 కోట్లకి గుజరాత్ దక్కించుకుంది.
Advertisement
గుమ్లా జిల్లాలోని గిరిజన తెగకు చెందిన మింజ్ హార్డ్ హిట్టర్ గా గుర్తింపు పొందాడు. ఇతను వయసు 21 ఏళ్ళు. ఈ ఏడాది ఆగస్టులో యూకే లో జరిగిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంపు కోసం అతని ని ముంబై ఇండియన్స్ ఎంపిక చేసింది క్లబ్ క్రికెట్లో అతను 140 స్ట్రైక్ రేటు తో బ్యాటింగ్ చేస్తున్నాడు ఐపీఎల్ మార్క్ వేలం సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అతన్ని లెఫ్ట్ హ్యాండ్ పోలార్డ్ గా అభివర్ణించాడు. 2023 వేలానికి ముందు లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు ఇతని ట్రైలర్స్ కోసం పిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రమే వెళ్లి సెలెక్ట్ కాలేదు దీంతో ఐపీఎల్ 23 వేలంలో అతనిని ఎవరూ కొనుక్కోలేదు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!