తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేలా రేవంత్ రెడ్డి ఎంతగానో శ్రమించారని చెప్పొచ్చు. అయితే రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి ఎలా అయితే శ్రమ పడ్డారో అదే విధంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గెలిపించడానికి ఇంకొక వ్యక్తి కూడా శ్రమించారట. కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచారు అంటే అందుకు కారణం ఆయన పట్టుదల శ్రమ అని తెలుస్తోంది.’
Advertisement
ఆయనని గెలిపించింది ఎవరో కాదు తిరుపతి రెడ్డి. రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతిరెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతగానో కష్టపడ్డారు. అయితే రేవంత్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతిరెడ్డి చేయని పని అంటూ ఏమీ లేదుట అంతేకాదు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ప్రతి అవ్వడం వలన సీఎం కేసీఆర్ తో పాటుగా కేటీఆర్ హరీష్ రావు తో పాటు బిజెపి పార్టీ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రేవంత్ రెడ్డి తో పాటుగా వీళ్ళందరూ కూడా తిరుపతిరెడ్డి మీద కూడా ఫోకస్ పెట్టారు ఆయన ఏమేం చేస్తున్నారనేది కూడా కనిపెట్టారట. తమ్ముడిని గెలిపించడానికి తిరుపతిరెడ్డి ఆ పని మీదే కష్టపడుతూ ముందుకు వెళ్లారు.
Advertisement
కొడంగల్ నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్ల దగ్గరికి వెళ్లి తమ్ముడికి ఓటు వేయమని మరీ చెప్పారట. రేపు ఎన్నికలు అనగా వాళ్లని కొడంగల్ కి తీసుకువచ్చి స్వయంగా ఓట్లు కూడా వేయించారు మొదట కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి తర్వాత మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచారు. కొడంగల్ ప్రజలను మాత్రం వదిలిపెట్టలేదు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నా లేకపోయినా ఆయన తమ్ముడు తరఫున తిరుపతిరెడ్డి అంతా చూసుకున్నారు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా తిరుపతిరెడ్డి చూసుకున్నారు వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాటన్నిటిని కూడా తీర్చారు కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ ఎన్నో విధాలుగా ట్రై చేసారు తిరుపతిరెడ్డి వాటి అన్నిటిని తిప్పి కొట్టేశారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!