తెలుగు సినిమాలోకం ఒక మంచి నటుడిని కోల్పోయింది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఎలాంటి మచ్చ లేకుండా ఎవరికి ఏ అన్యాయం చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడి సినిమా హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా,రాజకీయ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకొని సూపర్ స్టార్ గా మారారు.. అలాంటి కృష్ణ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ దాటుకొని జీవిత గమనంలో ముందుకు పోతున్న తరుణంలో ఆయనపై రాళ్ల దాడి కూడా జరిగింది.అయితే వివరాలు ఏంటో చూద్దాం..
Advertisement
also read;కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!
ఇండస్ట్రీలో అలనాటి హీరోల్లో ఎన్టీఆర్ అంటే ఎదురులేని హీరోగా ఉండేవారు. అలాంటి ఆయనపై ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి కృష్ణ. అప్పట్లో టిడిపి గవర్నమెంట్ పై ఒక సెటైర్ వేస్తూ పద్మాలయ స్టూడియోలో ఒక మూవీ ని తీసారట కృష్ణ. దీంతో టీడీపీ శ్రేణులు కృష్ణ పై పగ పెంచుకున్నారు. 1985లో మోసగాళ్లకు మోసగాడు సినిమా షూటింగ్ కోసం నంద్యాలకు వెళ్లిన కృష్ణ ఒక రైల్వే ఫారెస్ట్ బిడ్జి దగ్గర సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం అది.. ఈ టైంలోనే కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కృష్ణ.
Advertisement
అలా రాత్రి పది గంటల వరకు ప్రచారం ముగించుకొని కర్నూలు చేరుకుంటున్న సమయంలో కొంతమంది టిడిపి శ్రేణులు కృష్ణ పై రాళ్ల తో తీవ్రంగా దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిలో కృష్ణ కంటికి తీవ్రమైన గాయం కావడం వల్ల అక్కడే ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో కంటికి కుట్లు వేయించుకొని మరి ఆ తర్వాత జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమయంలో అభిమానులు ఆయనను చూడడానికి భారీ సంఖ్యలో వచ్చారు. ఈ విధంగా అప్పట్లో టిడిపికి వ్యతిరేకంగా పోరాడిన కృష్ణ రాజకీయంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ హీరో మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా శోక సాంద్రంలో మునిగారు.
also read;బాలయ్య, చిరంజీవిని ఆ విషయం లో వెనక్కి నెట్టేసిన తమిళ స్టార్ విజయ్…!