Home » కవల పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ నటులు ఎవరంటే..?

కవల పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ నటులు ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం. పెళ్లి ఒకెత్తయితే తర్వాత పిల్లల్ని కనడం అనేది వారి యొక్క ప్రేమకు ప్రతిరూపం. దాంపత్య జీవితంలో పిల్లలం కనడం వల్లనే వారు పరిపూర్ణమైన దంపతులవుతారు. అయితే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. కానీ ఒకేసారి ఇద్దరు ముగ్గురు కవల పిల్లలు పుడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో కవల పిల్లలకు జన్మనిచ్చిన సెలబ్రిటీలు ఎవరో చూద్దాం..
మంచు విష్ణు:

Also Read:పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్టేట్..!

Advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు 2009లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె విరానిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. అయితే తొలి సంతానంగా ఇద్దరు కవల ఆడపిల్లలు, వారికి అరియాన వివియాన అనే పేర్లు పెట్టారు. ఆ తర్వాత కూడా విష్ణు దంపతులకు అబ్బాయి మరో అమ్మాయికి జన్మనిచ్చారు.
ఉదయభాను :

Advertisement


ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ యాంకర్ గా పేరు పొందిన ఉదయభాను మొదట్లో ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని ఆయనతో మనస్పర్ధలు రావడంతో ఆ తర్వాత విజయ్ కుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి కవల ఆడపిల్లలు జన్మించారు. ఉదయభాను తన కుమార్తెలకు దివి నక్షత్ర, భువి ఆరాధ్య అనే పేర్లు పెట్టారు.
సన్నీ లియోన్ :

Also Read:ఛీ ఛీ క్యాంటిన్ లో కూడా అలాంటి పనులా ? నోటీసు బోర్డు పెట్టిన యాజమాన్యం..! 

పోర్న్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ తన సహనటుడు డానియల్ వేబర్ ని 2011లో పెళ్లి చేసుకుంది. 2017 లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరి పేర్లు అషర్,నోహ.
హీరో భరత్:

2013లో తన చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నారు భరత్. 2018 లో వీరికి కవల పిల్లలు పుట్టారు. ఆద్యన్ ,జైన్ అని పేరు పెట్టారు.
నయనతార:


కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నయనతార. ఈ దంపతులు కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.

Also Read:‘నా జీవితంలోనూ బ్రేకప్’.. సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading