Home » చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా..అయితే ప్రమాదమే..!!

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా..అయితే ప్రమాదమే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుండి 20 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. మరి ఇలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలేంటి..? సాధారణంగా కొంతమంది కుటుంబాల్లో వంశపారంపర్యంగా వారి తల్లిదండ్రులకు 30 ఏళ్లలోపు తెల్లజుట్టు వస్తే, వారి పిల్లలకు 20 ఏళ్లలోపు తెల్లజుట్టు రావచ్చు. అలాగే మనం తినే ఆహారంలో విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ తెల్ల జుట్టు చిన్న వయసులోనే రావడానికి కారణమవ్వచ్చు.

Advertisement

ప్రధానంగా విటమిన్ బి12, ఐరన్, కాపర్ ఇవన్నీ జుట్టుకు నల్లధనాన్ని ఇచ్చే విటమిన్స్. వీటి లోపం వల్ల కూడా తెల్ల జుట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్బనోస్ ఇలాంటి వారికి ఒళ్ళంతా తెల్లగా ఉండడమే కాకుండా జుట్టు కూడా తెల్లగానే ఉంటుంది. తల పై తెల్ల మచ్చలు వచ్చినప్పుడు మన జుట్టు కూడా తెల్లగా అవ్వడానికి కారణం అవుతుంది. అలాగే కొంతమందికి పేనుకొరుకుడు వల్ల కూడా తెల్ల జుట్టు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

Advertisement

ముఖ్యంగా 20 ఏళ్ల లోపు ఉన్న వారికి తెల్ల జుట్టు వస్తుంది అంటే తప్పనిసరిగా మనం టెస్టులు చేయించుకుని ఏదైనా ఆహార లోపం ఉందా లేదంటే వంశపారంపర్యంగా వచ్చిందా, వేరే ఇతర సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో వంశపారంపర్యంగా వస్తే మాత్రం దానికి ట్రీట్మెంట్ ఉండదట, ఆహార లోపం వల్ల వచ్చిన వాటిని మాత్రమే తగ్గించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading