Home » పని మీద బయటకు వెళ్తున్నప్పుడు..ఈ 5 సంకేతాలు ఎదురైతే పని సక్సెస్.. ఏంటవి..?

పని మీద బయటకు వెళ్తున్నప్పుడు..ఈ 5 సంకేతాలు ఎదురైతే పని సక్సెస్.. ఏంటవి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

భారతదేశంలో ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే చాలామంది శుభ ఘడియలు చూసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు కొన్ని సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అందులో మనం మంచి అని నమ్మేవి ఎదురయితే ఆ రోజు పని లో మంచి జరుగుతుందని భావిస్తాం. ఇంకా నమ్మకం పెంచుకుంటాం. అదే మనం చూడకూడనిది మనకు ఎదురైతే ఆరోజు వెళ్లే పని ఏమవుతుందో అని భయపడిపోతుంటారు. ఇందులో మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురైతే మన పనికి తిరుగుండదని నమ్ముతూ ఉంటామో అందులో కొన్నింటిని తెలుసుకుందాం..? మనం పని మీద బయటకి వెళ్లేటప్పుడు సెంటిమెంట్ ని బాగా ఫాలో అవుతూ ఉంటాం. అందులో మనం వెళ్లే సమయంలో మంచిది ఎదురైతే శుభం కలుగుతుందని, చెడ్డవి అనిపించేది ఎదురైతే ఆ పనిని వాయిదా వేసుకోమని సలహా ఇస్తూ ఉంటారు పెద్దలు. కొంతమంది శునకాలు ఎదురైతే చాలా మంచిదని నమ్ముతూ ఉంటారు.

Advertisement

అలాగే కొంతమంది పని మీద వెళ్ళేటప్పుడు అబ్బాయిలకి కుడికన్ను లేదా భుజం అదిరితే కన్యా లాభం అని భావిస్తారు. అదే కుడి కన్ను ఆడవాళ్లకు అదిరితే మంచిది కాదు అని భావిస్తారు. దీంతోపాటుగా అరచేతిలోని రేఖలలో దురదగా ఉన్న, అరికాళ్ళలో మంటలు వచ్చిన ఆడ మగవారిలో వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయని అంటుంటారు. ఈ సెంటిమెంట్ అనేవి మనోభావానికి సంబంధించిన విషయం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్ పేద వారి నుంచి మొదలు రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపార వ్యక్తులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా మనదేశంలో పిల్లిని అశుభం గా భావిస్తూ ఉంటాం. అయితే ఇంగ్లాండులో నల్ల పిల్లి శుభసూచకంగా పరిగణిస్తారు. అదే అమెరికా మరియు ఇండియా లో అశుభ సూచకంగా భావిస్తుంటాం. అలాగే ఇండియాలో నల్ల పిల్లి తో పాటుగా విధవరాలి ని, తుమ్మును, ఎండిన కట్టెలు అశుభ సూచకంగా నమ్ముతాం.

Advertisement

అలాగే ముత్తైదువులను, పచ్చ గడ్డి మేసే ఆవు, జంట బ్రాహ్మణులు ఎదురైతే శుభసూచకమని, మంచి జరగబోతుందని నమ్ముతూ ఉంటాం. వీటితో పాటుగా పిచ్చివాడు, ఎముకలు, చర్మము,నూనె,పత్తి, పాము, క్షవరం చేయించుకునే వాడు, దీర్ఘ రోగి, తల విరబోసుకున్న వారు పని మీద వెళ్తున్నప్పుడు ఎదురయితే అశుభసూచకం అని నమ్ముతూ ఉంటారు. అలాగే మనం బయటకు వెళ్లే సమయంలో చావు ఊరేగింపు చాలా శుభసూచకమని, మనం వెళ్లే పనిలో సక్సెస్ అవుతామని నమ్ముతారు. దీంతోపాటుగా ఉదయం సమయంలో బిచ్చగాడు ఇంటి దగ్గరికి వస్తే శుభసూచకమని, అతడికి దానం చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అంటారు. అలాగే పని మీద బయటకు వెళ్లేటప్పుడు గోవులకు పచ్చగడ్డిని వేస్తే మంచిదని, ఆవు పేడ కనిపించిన శుభసూచకమని నమ్ముతూ ఉంటారు.

also read:

 

Visitors Are Also Reading