Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » చికెన్,చేపలు ఇందులో ఏది మంచి ఆహారం..?

చికెన్,చేపలు ఇందులో ఏది మంచి ఆహారం..?

by Sravanthi Pandrala Pandrala
Ads

చాలామందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇందులో చికెన్, చాపలు అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే రోజు వారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది. అయితే చాలామందికి చేపలు చికెన్ ఈ రెండింటిలో ఏది పౌష్టికాహారం అనే అనుమానాలు ఉంటాయి. ఇందులో ఏది బలాన్ని ఇచ్చే ఆహారమో తెలుసుకోవాలి. దీనివల్లే వాటిని తినేందుకు ఇష్టపడతారు.

Advertisement

Ad

మరి ఇందులో ఆరోగ్యానికి ఏది మంచిది ఏది జీర్ణ వ్యవస్థ కు మంచిదో తెలుసుకుందాం. చేపల్లో ఉండేటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల గుండెకు మేలు కలుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B2 విటమిన్ డి చేపల్లో ఎక్కువగా ఉంటుంది.

Advertisement

అలాగే పొటాషియం, జింక్,అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని బలమైన ఆహారంగా చెబుతుంటారు. ఇక చికెన్ లో కూడా ప్రోటీన్లు విటమిన్ b6 విటమిన్ b12 మెగ్నీషియం, జింక్ ఉంటుంది. క్రమం తప్పకుండా తిన్నా ఏం కాదు. ఇక చికెన్ చేపల విషయానికి వస్తే చేపలే ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణం అవుతుంది. ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వైద్యులు చేపలు ఎక్కువ తినాలని అంటున్నారు.

also read:

Visitors Are Also Reading