Home » యాంక‌ర్ ప్ర‌దీప్ షోల‌కు రేటింగ్స్ ఏమిటి..? ఎక్క‌డ భారీగా తేడా..!

యాంక‌ర్ ప్ర‌దీప్ షోల‌కు రేటింగ్స్ ఏమిటి..? ఎక్క‌డ భారీగా తేడా..!

by Anji
Ad

తెలుగులో ప్ర‌స్తుతం ఉన్న యాంక‌ర్ల‌లో సుమ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక‌ర్‌గా కొన‌సాగుతుంది. సుమ త‌రువాత ఎవ‌ర‌న్నా రేటెడ్ యాంక‌ర్ ఉన్నారా అంటే ప్ర‌దీప్ అనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో ప్ర‌దీప్ పూర్వ‌కాలం నుంచీ యాంక‌ర్‌గా చేస్తున్నాడు. కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతా అనేది పాపులర్, హిట్ షో బాగుండేది కూడా. త‌ను ఎక్కువ‌గా అసోసియేట్ అయ్యేది జీ తెలుగుతోనే. కానీ ఆ ఒక్క షో మిన‌హా తను జీటీవీకి చేసి ఏషో కూడా పెద్ద‌గా క్లిక్ కాలేదు. ఇక మాటీవీకి సుమ‌తో క‌లిసి చేసిన పెళ్లిచూపులు డిజాస్ట‌ర్‌. ఇప్పుడు ఈటీవీలో వ‌చ్చే ఢీ డాన్స్ షో కాస్త న‌యం. ఇక సుధీర్‌-ర‌ష్మీ జంట వెళ్లిపోయాక ఆ షో కూడా పాపులారిటీతో దిగ‌జారిపోయింది.

Advertisement

Telugu TV anchor caught driving drunk, old 'don't-drink-and-drive' video  goes viral | The News Minuteవాస్త‌వానికి ఏ షో అయినా స‌రే మంచి యాంక‌ర్ అద‌న‌పు విలువ అవుతాడే త‌ప్ప కేవ‌లం యాంక‌ర్ ప్ర‌తిభ‌తో షోలు న‌డ‌వ‌వు. బేసిక్‌గా కంటెంట్‌లో ప్లానింగ్‌లో ద‌మ్ముండాలి, కొత్త‌ద‌నం ఉండాలి, ప్రేక్ష‌కుడిని ఆ స‌మ‌యంలో ఆషో వ‌ద్ద‌కు ర‌ప్పించాలి. అస‌లు యాంక‌ర్ల‌కే తాత అయిన ఓంకార్ యాంకర్ త‌నే నిర్మించి త‌నే కాన్సంట్రేట్ చేసి, త‌నే కాన్సెప్టు రూపొందించుకుని త‌నే కంటెంట్ రాసుకొని హిట్ చేసుకున్న షోలు ఉన్న‌య్‌. అలాంటి ఓంకార్ న‌టించే మాయాద్వీపం తాజా రేటింగ్స్ అయితే మ‌రీ ఘోరంగా 0.83కు పడిపోయాయి. స‌రుకులో నాణ్య‌త ఉండాలే త‌ప్ప యాంక‌ర్ల‌తో ప‌డిపోవ‌డాలు, పెరిగిపోవ‌డాలు ఏమీ ఉండ‌వు. ఆ కోణంలో ప్ర‌దీప్‌షోల రిజ‌ల్ట్ కూడా జ‌స్ట్‌, బ్యాడ్ ల‌క్.. నాట్ హిజ్ ఫాల్ట్ అని గుర్తుంచుకోవాలి.

Advertisement

Visitors Are Also Reading