Home » ఓటీటీలోకి కాంతారా వచ్చేది ఎప్పుడంటే ?

ఓటీటీలోకి కాంతారా వచ్చేది ఎప్పుడంటే ?

by Anji
Ad

కన్నడంలో చాలా చిన్న సినిమాగా విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందనే చెప్పాలి. ఎక్కువ లాభాలను వసూలు చేసింది.

Also Read : రాజ‌బాబు కుమారులు దేశం గ‌ర్వించే స్థాయిలో స్థిర‌ప‌డ్డార‌ని తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?

Advertisement

శాండిల్ వుడ్ లో కేజీఎఫ్ 2 తర్వాత మళ్లీ ఆ స్థాయి వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. కన్నడంలో అద్భుతమైన హిట్ కొట్టిన ఈ మూవీని రీసెంట్ గా తమిళ , తెలుగు , హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక మళయాలం వెర్షన్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Also Read : కీర్తి సురేష్ కి మృణాల్ ఠాకూర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

కన్నడం అంటుంచితే.. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులనే క్రియకేట్ చేస్తోంది. మంచి వసూళ్లు రాబట్టుతోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా కన్నడ వెర్షన్ ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. అధికారిక మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించలేదు. నవంబర్ 4 ఓటీటీలో విడుదలవుతుందో లేదో అనేది త్వరలోనే తెలియనుంది.

Also Read : మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న నాని..!

 

Visitors Are Also Reading