Telugu News » Sadha : ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..!

Sadha : ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..!

by Bunty

స్టార్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో వెలుగు వెళ్ళిపోయినటువంటి సదా ప్రస్తుతం సినిమాలలో అంతగా నటించడం లేదు. ఈ మధ్య ఎక్కువగా షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. జయం సినిమాతో దాదాపు ప్రేక్షకుల అందరి మనసులను గెలుచుకుంది ఈ భామ. ఇక ఆ సినిమా అనంతరం వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. చాలా సినిమాల్లో నటించి ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది. టీవీ షోలు చేస్తూ, హోటల్ బిజినెస్ లు అంటూ ఫుల్ బిజీగా మారిపోయింది.

When Sadha Opens Up About Her Scene With Gopichand In Jayam Movie

When Sadha Opens Up About Her Scene With Gopichand In Jayam Movie

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా… జయం సినిమా తాలూకు జ్ఞాపకాలను పంచుకుంది. తేజ దర్శకత్వంలో నితిన్, గోపీచంద్ హీరోలుగా సదా హీరోయిన్ గా చేసిన సినిమా జయం. ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలో ఓ సీన్ తనని విపరీతంగా బాధించిందని సదా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సీన్ ఎప్పుడు చూసిన తనకు ఏదోలా అవుతుందని, అందుకే ఆ సీన్ వస్తే నేను చూడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే…గోపీచంద్ సదా బుగ్గలని నాకేటువంటి సీన్. ఇక సినిమా చివరి క్షణాలలో వచ్చేటువంటి ఈ సీన్ తనని ఎంతో ఇబ్బందికి గురి చేసిందని చెప్పుకొచ్చింది.

అయితే ఈ సీన్ చెప్పినప్పుడు సదా వద్దని చెప్పిందట. కానీ ఆ సీన్ సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పడంతో ఓకే చెప్పిందట. ఇక డైరెక్టర్ చెప్పాడు కాబట్టి కాస్త ఇబ్బందిగానే ఆ సీనుకి సదా ఓకే చెప్పి ఆ సీన్ లో నటించిందట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సదా విపరీతంగా ఏడ్చానని, రాత్రంతా నిద్రపోకుండా ఆ సీన్ గురించే ఆలోచించానని, ఇంటికి వెళ్లి తన ముఖాన్ని కడుగుతూనే ఉందట. ఇక ఆ సినిమా టీవీలో వచ్చినప్పుడల్లా ఆ సీన్ వస్తుందంటే చాలు టీవీ చూడకుండా ఎక్కడికైనా బయటకు వెళ్లేదట సదా.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading