Telugu News » Blog » అడ‌విశేష్‌ పాన్ ఇండియా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల ఎప్పుడంటే..?

అడ‌విశేష్‌ పాన్ ఇండియా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji
Ads

వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్లుతూ.. త‌న‌దైన న‌ట‌న‌తో ఆకట్టుకుంటున్నాడు అడ‌వి శేష్‌. న‌ట‌నకు ప్రాధాన్య‌త ఉన్న క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. తాజాగా అడ‌వి శేష్ న‌టిస్తున్న ఆస‌క్తిక‌ర‌మైన మూవీ మేజ‌ర్. ఇది అడ‌వి శేష్ తొలి పాన్ ఇండియా మూవీ మేజ‌ర్‌. శ‌శి కిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూన్ 03న విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Ads


ప్ర‌స్తుతం మేజ‌ర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జోరుగా కొన‌సాగుతున్నాయి. 26 11 హీరో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ‌, సాయి ముంజ్రేక‌ర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, రేవ‌తి, ముర‌ళీ శ‌ర్మ ప్ర‌ముఖ పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను మే 09న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ వీడియోను చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది.

Ads

మేజ‌ర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో చిత్రీక‌రించిన‌ట్టు వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. రెండు భాష‌ల్లో విడివిడిగా చూపించిన స‌న్నివేశాలు ఆద్యంతం ఆసక్తిక‌రంగా ఉన్నాయి. వార్ ఎటాక్‌, యాక్ష‌న్, రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. మ‌హేష్ బాబు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్‌తో క‌లిసి సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న మేజ‌ర్‌ జూన్ 03 ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానున్న‌ది.

Also Read : 

మ‌హేష్ బాబుకు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తికి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

Ad

బాలకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవటానికి కారణం అదేనా ?