మనం ఏదైనా పనిచేయాలనుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో రకరకాల ఆలోచనలు చేస్తాం. నేను అనుకున్న పని సక్రమంగా నెరవేరాలని మన ఇష్టదైవాన్ని తలచుకుంటాం. దీనికోసం మంచి ముహూర్తం, మంచి రోజు చూసుకుంటాం. మరికొందరు కొంతమంది ముఖాన్ని చూస్తే సెంటిమెంట్ గా ఫీలవుతారు. అయితే పని మీద బయటకు వెళ్లేటప్పుడు వారికి ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుందో వారి ముఖాన్ని కూడా చూసి వెళతారు. కొందరు వాళ్ళ భార్య ముఖం చూస్తే, మరికొందరు పిల్లల ముఖం చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.
Advertisement
ఎవరి నమ్మకాలు వారివి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని రకాల పదార్థాలను మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు నోటిలో వేసుకోవడం వల్ల మనకు అన్నీ లాభాలే వస్తాయని చెబుతుంటారు.. మరి అవి ఏ పదార్థాలు ఓసారి చూద్దాం..? మనం ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు మన నోట్లో కొద్దిగా బెల్లం లేదా చక్కెరను వేసుకొని వెళ్తే మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.ఇవి నోట్లో వేసుకుంటే ఏ విధంగా తీయదనం వస్తుందో మనం వెళ్లిన పని కూడా ఆ విధంగానే సక్సెస్ అవుతుందని భావిస్తారు. నోట్లో తీయదనం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నమ్ముతారు. అందుకే మన పెద్దలు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు నోరు తీపి చేసుకోవాలన్నారు.
Advertisement
అందుకే ఏ శుభకార్యం ప్రారంభించిన ముందుగా నోరు తీపి చేసి, తర్వాత పని ప్రారంభిస్తారు. అలాగే గణపతికి బెల్లం అంటే చాలా ఇష్టం. ఇంట్లో నుంచి మంచి పని మీద బయటకు వెళ్లేటప్పుడు కొద్దిగా బెల్లాన్ని నోట్లో వేసుకొని వెళితే విజయం సాధిస్తారని అంటారు. వినాయకుని మనసులో తలచుకుని కొంత బెల్లాన్ని ఆయనకు ప్రసాదంగా సమర్పించి మన నోటిలో వేసుకుంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.
also read;
విజయశాంతి, సాయిపల్లవికి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటంటే..?
మనం పిచ్చి మొక్క అనుకునే ఈ మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..?