ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో పాటలకు సంగీతాన్ని అందించారు. రెహమాన్ పాటలకి ఎంతోమంది అభిమానులు ఉండడం విశేషం. ఇతని మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఏఆర్ రెహమాన్ ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. రెహమాన్ ఇతని అసలు పేరు దిలీప్ కుమార్. ఇస్లాం మతంలోకి మారిన తర్వాత తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నారు. అతను ఇస్లాం మతంలోకి మారడానికి గల కారణాలను చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు రెహమాన్. ఇతని తండ్రి మ్యూజిక్ డైరెక్టర్. తన తండ్రి మరణానంతరం రెహమాన్ సంగీత దర్శకుడిగా మారారు.
Advertisement
రోజా సినిమా విడుదలకు ముందు తన కుటుంబసభ్యులతో కలిసి ఇస్లాం మతంలోకి మారారు. తన తల్లి కరీమా బేగం రోజా సినిమా సమయంలో తన కొడుకు పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చాలని పట్టుబట్టారట. తన మొదటి సినిమాలోనే అతని పేరు ఏ ఆర్ రెహమాన్ గా ప్రసిద్ధికెక్కింది. తాను ఇస్లాం మతంలోకి మారిన తర్వాత కెరీర్లో మంచి విజయం సాధించారని ఏఆర్ రెహమాన్ నీ చాలామంది ప్రశ్నించారట. కానీ ఇంతవరకు ఈ విషయం పైన ఏ ఆర్ రెహమాన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి