Home » వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్‌.. త్వ‌ర‌లోనే స్క్రీన్‌షాట్ బ్లాక్..!

వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్‌.. త్వ‌ర‌లోనే స్క్రీన్‌షాట్ బ్లాక్..!

by Anji
Ad

ప్ర‌ముఖ సోష‌ల్ మేనేజింగ్ యాప్ వాట్సాప్ నూత‌న ఆప్ష‌న్ల‌ను తీసుకొస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా స్క్రీన్ షాట్ బ్లాకింగ్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌ది. గ‌తంలో వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్ కి కొంత‌కాలం అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. మ‌నం పంపిన మెసేజ్ అవ‌త‌లి వ్య‌క్తి చూసిన త‌రువాత వెంట‌నే డిలీట్ అయిపోవ‌డం దీని స్పెషాలిటీ. అయితే అది డిలీట్ అయిపోవ‌డానికి ముందే కొంత‌మంది స్క్రీన్ షాట్లు తీయ‌డం ప్రారంభిస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యూ వ‌న్స్ కాన్సెప్ట్‌కే అర్థం లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:  పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా..?

Advertisement

వ్యూ వ‌న్స్ మెసేజ్‌ల‌ను స్క్రీన్ షాట్ తీయ‌డానికి వీలు లేకుండా కొత్త ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ట్టు వాట్సాప్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు iOS beta టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచ‌ర్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. మ‌న‌కు వ‌చ్చే ఇమేజెస్ వీడియోల నుంచి మ‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఇష్టం వ‌చ్చిన స‌మ‌యంలో స్క్రీన్ షాట్లు తీయ‌డం ఇక కుద‌ర‌ద‌న్న‌మాట‌. మెటా వ‌ర్స్ ఫౌండ‌ర్ సీఈఓ మార్క్ జుకెర్ బ‌ర్గ్ ఈమ‌ధ్య ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. వాట్సాప్ మూడు నూత‌న ప్రైవ‌సీ ఫీచ‌ర్లు తీసుకొస్తున్న‌ట్టు తెలిపారు. మ‌నం మెసేజ్ చేసేట‌ప్పుడే వాటిని స్క్రీన్ షాట్ తీయ‌కుండా అద‌న‌పు భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌నున్నారు. ఐఓఎస్ త‌రువాత ఈ త‌ర‌హా ఫీచ‌ర్ ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుందని మార్క్ జుకెర్ బ‌ర్గ్ వెల్ల‌డించారు.

Advertisement

ఇవి కూడా చదవండి:  లైగ‌ర్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. కీల‌క సీన్లు క‌ట్‌..!

కొత్త ప్రెజెంటేష‌న్ స్క్రీన్ పై ప‌ని చేస్తుంది. ఓ సారి వీక్ష‌ణ కొత్త వెర్ష‌న్‌ను ప‌రిచ‌యం చేస్తుంది. కొత్త వెర్ష‌న్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. చిత్రాలు వీడియోల‌ను వీక్షించాక వాటి స్క్రీన్ ల‌ను తీయ‌డం సాధ్యం. మ‌నం పంపిన చిత్రాలు వీడియోల‌ను ఒక‌సారి వీక్షించ‌డానికి స్క్రీన్‌షాట్ తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు స్క్రీన్ షాట్ స్వ‌యంచాల‌కంగా బ్లాక్ చేయ‌బడుతుంది. కానీ పంపిన వారు నోటిఫికేష‌న్ స్వీక‌రించ‌రు. సెకండ‌రీ ఫోన్ లేదా కెమెరాను ఉప‌యోగించి వినియోగ‌దారు ఇప్ప‌టికీ ఫోటో తీయ‌వ‌చ్చు. కొత్త ఫీచ‌ర్లు వాట్సాప్ వినియోగ‌దారుల‌కు అంద‌రికీ తెలియ‌కుండా గ్రూప్ చాట్‌ల నుంచి నిష్క్ర‌మించ‌డానికి మీరు ఆన్‌లైన్‌లో ఉన్న‌ప్పుడు ఎవ్వ‌రూ చూడ‌వ‌చ్చో నియంత్రించ‌డానికి సందేశాల‌ను ఒక‌సారి వీక్షించే స్క్రీన్ షాట్‌ల‌ను నిరోధించ‌డానికి అనుమ‌తిస్తుంది. మేము మీ సందేశాల‌ను ర‌క్షించ‌డానికి, వాటిని వ్య‌క్తిగ‌తంగా ముఖాముఖి సంభాష‌ణ‌ల వ‌లే సుర‌క్షితంగా ఉంచ‌డానికి కొత్త మార్గాల‌ను రూపొందిస్తుంటామ‌ని జుక‌ర్ బ‌ర్గ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:  Astrology : ఆ రాశుల వారితో జాగ్ర‌త్త‌.. వారి మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియ‌దు..!

Visitors Are Also Reading