Home » వాట్సాప్ యూజర్లకు షాక్..20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్…!

వాట్సాప్ యూజర్లకు షాక్..20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్…!

by AJAY
Ad

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఇక ప్రతి ఫోన్ లోనూ వాట్సాప్ ఉంటుంది. ఈ మెసేజింగ్ యాప్ కు పోటీగా ఎన్ని యాప్ లు వచ్చినా నిలబడలేకపోయాయి. దాంతో వాట్సప్ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. క్రేజ్ కు తగినట్టుగానే వాట్సాప్ కూడా వినియోగదారుల కోసం ఎప్పుడూ సరికొత్త అప్డేట్ లు తీసుకువస్తూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే వాట్సాప్ తో ఎన్నో లాభాలు ఉన్నట్టుగానే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో లో మోసాలకు పాల్పడుతున్నారు.

Whatsapp bans 20lakhs accounts

Whatsapp bans 20lakhs accounts

దాంతో యూజర్ల నుండి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ చర్యల్లో భాగంగా కొత్త ఐటీ రూల్స్ ప్రకారం గత అక్టోబర్ నెలలో వాట్సాప్ ను దుర్వినియోగం చేసిన యూజర్లను గుర్తించి దాదాపు 20 లక్షల అకౌంట్ లను తొలగించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాకుండా అదే నెలలో వాట్సాప్ గ్రివియన్స్ సెల్ కు ఐదు వందల ఫిర్యాదులు రాగా వాటిలో 18 అకౌంట్ల పై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Advertisement

జ‌నవ‌రి 1 నుండి పెర‌గ‌నున్న‌ బ‌ట్ట‌లు, చెప్పుల రేట్లు!

సెప్టెంబర్ లో 560 ఫిర్యాదులు రాగా 2.2 మిలియన్ లకు పైగా అకౌంట్లను నిషేధించబడ్డాయని పేర్కొంది. ఆగస్టు నెలలో 420 ఫిర్యాదులు రాగా దాదాపు 2మిలియన్ అకౌంట్ లు నిషేధించబడ్డాయని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా వాట్సాప్ కు 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇక వాట్సాప్ లో మెసేజింగ్ తో పాటు ఆడియో వీడియో కాల్స్ మరియు యూపిఐ పేమెంట్స్ కూడా జరిపే ఆప్షన్లు ఉన్నాయి. అయితే వాట్సాప్ లో యూపీఐ పేమెంట్స్ ను మాత్రం యూజర్లు పెద్దగా వినియోగించడం లేదు.

Visitors Are Also Reading