ప్రతి మనిషికి పళ్ళు చాలా ముఖ్యం. మనం ఏం తినాలన్నా పళ్ళ మీద ఆధారపడతాం. అందువల్ల ప్రతి ఒక్కరూ వాటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అందుకు బ్రషింగ్ వంటి చాలా పనులు కూడా చేస్తుంటారు. అయినా కూడా కొందరి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అలా పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం
Advertisement
అయితే పళ్ళు పుచ్చిపోవడము కి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు. మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం పళ్లకు అతుక్కుపోయేవె ఉంటాయి. కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా శుభ్రపారచాలి. ఒకవేళ అలా చేయలేక పోతే మీకు పళ్ళు పుచ్చి పోవడం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఎక్కువగా ఆహారం అనేది మీ దవడ పళ్ళుకి అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి ఆ వైపు పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అయితే మీ పళ్ళల్లో ఆహారం ఇరుక్కుపోయినటు మీకు అనిపించినా… మీ పళ్ళ పైన ఏవైనా నల్లటి మచ్చలు మీకు కనిపించిన మీ పళ్ళు పుచ్చి పోవడం అనేది ప్రారంభమైనట్టు. ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలైతే దీనికి విరుగుడు అనేది ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
మీకు నల్లని మచ్చలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళితే కేవలం ఆ భాగాన్ని మాత్రమే తొలగించి దానిని ఫిల్లింగ్ చేస్తారు అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు. ఒకవేళ మీరు ఆలస్యం చేసినట్లయితే పళ్ళు పుచ్చిపోఏలా చేసే బ్యాక్టీరియా నరాల వరకు చేరి దెబ్బతీస్తుంది. అటువంటి సమయంలో మీరు గుర్తించినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళితే… ఆ పూర్తి పన్నును తీసేసి ఫీలింగ్ చేస్తారు. ఒకవేళ ఆ సమయంలో కూడా మీరు లెక్క చేయకుండా అలాగే ఉంటే అది ఒక పన్ను నుండి మరొక వ్యాపిస్తూ మీ అన్ని పళ్ళను దెబ్బతీస్తుంది. అప్పుడు మీకు నొప్పి అనేది ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మీ పళ్ళు పీకడం తప్పించి మరో మార్గం ఉండదు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇవి కూడా చదవండి :
ఒక్కే మ్యాచ్ లో 4 రికార్డులు సాధించిన గబ్బర్..!
ఆరెంజ్ క్యాప్ పోటీ ఆ ఇద్దరికే..?