గూగుల్ రీసెంగ్ గా మహిళల గూగుల్ సెర్చింగ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలని వెల్లడించింది. దేశంలో ఉన్న మొత్తం ఇంర్నెట్ వినియోగించే జనాభాలో ఆరుకోట్ల మంది మహిళలు ఉన్నట్టు ఈ రిపోర్ట్ పేర్నొంది. అందులో 75శాతం మంది 15 నుండి 34 సంవత్సరాల మధ్య వయసువాళ్లు ఉన్నారని పేర్నొంది.
Also read: ఖడ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అసలు కథ ఏమిటంటే..?
Advertisement
కాగా వాళ్లు తమ జీవితాన్ని మెరుగుపర్చుకునే విషయాల గురించి ఎక్కువగా సెర్చె చేస్తారని తెలిపింది. సంగీతాన్ని ప్రతిఒక్కరూ వింటారు. కానీ మహిళలు ఎక్కువగా సంగీతం గురించి వెతుకున్నారని గూగుల్ నివేధిక పేర్కొంది. అందులోనూ రొమాంటిక్ పాటలను ఎక్కువగా వింటారని తెలిపింది.
Advertisement
ముగ్గుల డిజైన్లు , మెహందీ డిజైన్ల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తారని గూగుల్ ప్రకటించింది. అదేవిధంగా మహిళలు ఎక్కువగా బ్యూటీకి ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళళు ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కూడా గూగుల్ లో వెతుకుతున్నారని తెలిపింది.
అంతే కాకుండా సరికొత్త ఫ్యాషన్ గురించి తెలుసుకుంటారని మంచి బ్రాండ్ దుస్తులు దొరికే షాపింగ్ మాల్స్ గురించి వెతుకుతారని వెల్లడించింది. ఇక చాలా మంది మహిళలు బాల్యం నుండే మంచి అభిరుచి కలిగి ఉంటారని ఎక్కడ చదువుకోవాలి…కెరీర్ లో ఏమవ్వాలి అన్నదానిపై వెతికేందుకు ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారని గూగుల్ పేర్కొంది.
Also Read: పురుషుడు ప్రేమతో స్త్రీకి ఎలాంటి ముద్దులిస్తాడో చెప్పిన పద్యం!