సాధారణంగా సినిమాల్లో కొన్ని కొన్ని రోగాలను కూడా కామెడీ చేసేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఎయిడ్స్, షుగర్, బీపీ, రేచీకటి వంటి వ్యాధులు తెగ సెటైర్లు వేస్తుంటారు. అదేవిధంగా క్షయ, కుష్టు రోగాల మీద కూడా సినిమాల్లో కామెడీ జరుగుతుంటుంది. కొన్ని సినిమాల్లో ఆరోగ్యం బాలేదని.. క్షయ, క్యాన్సర్ వచ్చిందని అబద్ధం ఆడుతూ డబ్బులు లాగడం చూశాం. అదేవిధంగా చాలా సినిమాల్లో రే చీకటి మీద చేసిన కామెడీలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ 3 మూవీలో రే చీకటి మీద వెంకటేష్ పాత్ర సూపర్ హిట్ అయిందనే చెప్పాలి.
Advertisement
అసలు ఈ రే చీకటి అనేది ఎందుకు వస్తుంది..? పగలు కనిపిస్తూ రాత్రి సమయానికి వెలుతురులో కూడా చీకటిగా ఉంటుంది. ఈ వ్యాధి రే చీకటి అని పిలుస్తుంటారు. ఈ వ్యాధినే రే చీకటి అని పిలుస్తారు. రే చీకటి అనేది ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా ఎక్కువగా పిల్లలకు వస్తుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా పొడి ఆరిపోయినట్టుగా ఉంటుంది. కంటి గ్రుడు మీద తెల్లని మచ్చలుంటాయి.
Advertisement
వ్యాధిగ్రస్తులు మసక వెలుతురులో వస్తువులను సరిగ్గా చూడలేకపోవడం సమస్య. దీనిని ఇంకా అశ్రద్ధ చేస్తే పూర్తి అంధత్వం వచ్చే అవకాశముంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న బొప్పాయి, క్యారెట్, కోడిగుడ్డు, తాజా ఆకుకూరలు, పాలు, పండ్లు మొదలైన వాటిలో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఏ ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అంధత్వ నిర్మూలన పథకం కింద మన దేశంలోని పిల్లలను రే చీకటి నుంచి రక్షించడానికి 9 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ ద్రావణం నోటి ద్వారా అందిస్తున్నారు.
Also Read :
పిల్లలకు పాలిచ్చే తల్లులు మధుమేహాన్ని ఈ చిట్కాలతో కంట్రోల్ చేయవచ్చు..!