తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ భార్య జీవిత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె పేరు జీవిత రాజశేఖర్ గా మారిపోయింది. జీవిత భర్త పేరులో మాత్రమే కాదు.. కష్ట, సుఖాల్లో కూడా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఆమె కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కావడం విశేషం. ఆదర్శ గృహిణిగా జీవిత ఎంత సైలెంట్ గా ఉన్నప్పటికీ ఏదైనా అన్యాయం తన కళ్ల ముందు కనిపిస్తే.. ప్రశ్నించి అడగడంలో ఆమె ముందుంటారనే చెప్పాలి. స్త్రీ యొక్క బాధ్యతలన్నీ తెలిసిన మహిళా కాబట్టి మహిళా హక్కుల కోసం ఆమె గొంతు గట్టిగానే వినిపిస్తోంది.
Advertisement
Advertisement
సోషల్ పలు ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవిత రాజశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ” నాకు మా వారిని, మా ఇంటిని, మా ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడమే చాలా ముఖ్యం. నా జీవితంలో నా మొదటి ప్రియారిటీ అదే అని, నా కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం వారి పనులను ఇంకెవ్వరో చేయడం నాకు అస్సలు నచ్చదు. వారికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడమే నాకు చాలా ఇష్టం. నేను బయటికి వెళ్లేది కూడా చాలా తక్కువ. నాకంటూ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా లేరు. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కొందరూ టచ్ లోనే ఉంటారు. వారిలో డైరెక్టర్ తేజ కొరియోగ్రాఫర్ బృంద, సుచిత్ర చంద్రబోస్ కూడా ఉన్నారు. ఎలాంటి సమయంలో అయినా సరే తాగడం అనేది నాకు అస్సలు అలవాటు లేదు” అని తెలియజేశారు.
“నేను మహిళను కాబట్టి తాగను అని చెప్పడం లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి తాగను. ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల తాగడం ఏంటి అని ప్రశ్నిస్తే.. మాత్రం అస్సలు ఒప్పుకోను.. ఎందుకు తాగకూడదు అని నిలదీస్తానని చెప్పారు. సరదాలు అనేవి అందరికీ ఉంటాయి. దానికి జెండర్ తో పని లేదని.. మందు తాగడానికి ఆడ, మగ తేడా ఏం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు జీవిత రాజశేఖర్. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దూమారమే లేపుతున్నాయి.
Also Read : రామ్ చరణ్ ని అవమానించిన షారూఖ్.. బయటపెట్టిన మేకప్ ఆర్టీస్ట్..!