సోమవారం జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ లేదా పవిత్రోత్సవానికి ముందు అయోధ్యలోని రామ మందిరంలో కొత్త శ్రీరాముని విగ్రహాన్ని నిన్న తీసుకొచ్చి పెట్టారు. విగ్రహం యొక్క మొదటి ఫోటోను ఈ ఉదయం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాల రాముడిగా.. రాముల వారిని ఐదేళ్ల పిల్లవాడిగా రూపొందించారు. చూడముచ్చటగా ఉన్న బాల రాముడి విగ్రహం మొదటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉంచారు. అసలు ఈ కళ్ళకు గంతలు కట్టడం ఎందుకు? రాయి దేవుడిగా ఎలా మారుతుంది? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
దేవాలయ వైభవాన్ని కలిగి ఉండే విగ్రహం కేవలం రూపం అలంకారం వలన దేవతగా ఆరాధించబడదు. ఆ విగ్రహం ప్రతిష్టించబడిన నేల కూడా ప్రధానమైనదే. అందుకే అయోధ్యలో ఆ స్థలం లోనే రాముడిని ప్రతిష్టించాలి అని అంత పోరాటం జరిగింది. ఆగమ శాస్త్రం నదీ తీర ప్రాంతాలను దేవాలయాలకు అనుకూలంగా ఉంటాయని సూచిస్తుంది. వైష్ణవ ఆలయాలకు వైఖానస ఆగమనం, శివాలయాలకు స్మార్త ఆగమనం, అమ్మవారి ఆలయాలకు శక్తి ఆగమనం ప్రకారం దేవాలయ నిర్మాణాన్ని చేస్తూ ఉంటారు.
Advertisement
ఓ రాయిని విగ్రహం చెక్కుతారు. చిన్న విగ్రహాలను నుంచుని చెక్కేయగలుగుతారు. కానీ, పెద్ద విగ్రహాలను చెక్కేటప్పుడు వాటి తొడలపై ఎక్కి చెక్కాల్సి వస్తుంది. అప్పుడు అది దేవతా స్వరూపం కాదు. రాయి అనే అంటారు. చెక్కడం పూర్తి అయిన తరువాత ఆ విగ్రహాన్ని ఐదు రకాల శుద్ధి చేస్తారు. అవేంటంటే.. జలాధివాసం (నీటితో శుద్ధి), ధాన్యాధివాసం (విగ్రహాన్ని ధాన్యం లో ఉంచి ఉష్ణోగ్రతలను సరి చేయడం), పుష్పాధివాసం (పూలలో ఉంచి.. పూలలోని సున్నితత్వాన్ని చేర్చడం), క్షీరాధివాసం (పాలతో శుద్ధి), పంచ శయనాదివాసం (వివిధ ఉపచారాలు). ఇవన్నీ పూర్తి అయ్యాకే ఆ రాయిని దేవతగా భావిస్తారు. ఆ తరువాత గ్రామా ప్రదక్షిణ చేస్తారు. ఆ దైవం రక్షించాల్సిన సరిహద్దులను, ప్రజలను పరిచయం చేస్తూ గ్రామ ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత వాస్తు మండపం వేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాస్తు లోపాలు లేకుండా ఉండడం కోసమే వాస్తు మండపాన్ని నిర్మిస్తారు. నాలుగు వైపులా నాలుగు మండపాలు వేసి, వాటి మధ్యలో సర్వతోభద్ర మండపం వేస్తారు. ఆ తరువాత పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఈ క్రతువుల ద్వారా విగ్రహంలో యాభై శాతం శక్తీ నిక్షిప్తమై ఉంటె, ఆ స్థలంలో వేసిన యంత్రాలలో మరో యాభై శాతం శక్తీ నిక్షిప్తమై ఉంటుంది. యంత్ర విన్యాసం శక్తీ కూడా ఎక్కువే ఉంటుంది. తిరుమలలో కూడా శ్రీవారి విగ్రహం ప్రతిష్టించినంతనే శక్తీ వచ్చేయలేదు. ఆది శంకరాచార్యుల వారు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించిన తరువాతే అక్కడ శక్తీ పెరిగిందని పండితులు చెబుతుంటారు. ఇన్ని అంకాలు పూర్తి అయ్యిన తరువాతే ఆ దేవాలయం భక్తులకు ఆ దేవుని అనుగ్రహాన్ని అందించడానికి సిద్ధం అవుతుంది.