Home » ర‌ష్మీ గౌత‌మ్ ఒక్కో షోకి తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

ర‌ష్మీ గౌత‌మ్ ఒక్కో షోకి తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

by Anji
Ad

బుల్లితెర గ్లామ‌ర్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. పేరుకు ఆమె యాంక‌ర్ అయిన‌ప్ప‌టికీ ఆమెకు ఓ స్టార్ హీరోయిన్స్‌కి త‌గ్గని ఇమేజ్ ఉంది. యాంక‌ర్‌గా పిచ్చ గ్లామ‌ర్ ద‌క్క‌డంతో హీరోయిన్‌గా ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఇక త‌న గ్లామ‌ర్‌ను న‌మ్ముకొని సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేద్దాం అని ప్ర‌య‌త్నించిన ర‌ష్మీ గౌత‌మ్ హీరోయిన్‌గా కాదు క‌దా.. సైడ్ క్యారెక్ట‌ర్స్ కూడా పెద్ద‌గా ద‌క్క‌లేదు. దీంతో ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ నుంచి త‌ట్టా బుట్టా స‌ర్దేసుకున్న స‌మ‌యంలో బుల్లితెర నుండి ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చాయి. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, ఢీ డాన్స్ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. సోష‌ల్ మీడియాలో కూడా త‌న అందాల‌ను ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి పిచ్చేక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.


ర‌ష్మీ ప్ర‌స్తుతం ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు యాంక‌ర్ గా అద‌ర‌గొడుతున్నారు. ఇదిలా ఉంటే.. ర‌ష్మీ గౌత‌మ్ రెమ్యున‌రేష‌న్ గురించి ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ర‌ష్మీ గౌత‌మ్ ఒక్కో షో కి రూ.1.5 నుంచి 2ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసిన ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇందులో వాస్త‌వం ఎంత ఉందో తెలియ‌దు కానీ.. ర‌ష్మీ అంత‌గా సంపాదిస్తుందా అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు.

Advertisement

Advertisement

ఇక ర‌ష్మీ అంటేనే ట‌క్కున గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్‌. జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌గా వీరు ల‌వర్స్ అనే ఓ రూమర్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ ఎఫైర్ పై ప్రేక్ష‌కులు అత్యంత ఆసక్తి చూపడంతో దానిని మ‌రొక లెవెల్‌కి తీసుకెళ్లారు. దాదాపు తొమ్మిదేండ్లుగా ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా చ‌లామ‌ణి అవుతున్నారు. కెరీర్‌, ఈవెంట్స్ కోసం అనేది వారి స‌న్నిహితుల‌కు మాత్ర‌మే తెలిసిన నిజం. సుధీర్‌, ర‌ష్మీ ఈ విష‌యాన్ని ధృవీక‌రించిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య ఏదో ఉన్న‌ద‌ని న‌మ్మే వాళ్లు లేక‌పోలేదు. ఏది ఏమైనా ర‌ష్మీ మాత్రం దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని చ‌క్క‌గా పాటిస్తుంది. ఈ అమ్మ‌డు భోళా శంక‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిన‌దే.

Also Read : 

అన్న క‌ల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఏమి చేస్తున్నాడో తెలుసా..?

అల్లు అర్జున్ కూతురు అర్హ పై ట్రోలింగ్‌.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

 

Visitors Are Also Reading