టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ రాజబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజబాబు పేరు చెప్పగానే రమాప్రభతో ఆయన చేసినటువంటి సన్నివేశాలు చాలానే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఈ తరానికి అసలు పరిచయం లేని పేరు రాజబాబు అనే చెప్పాలి.
Advertisement
1960 నుంచి 1980 వరకు ఆయన సినిమాలు చూసిన వారికి బాగా తెలుసు. ఇప్పుడు బ్రహ్మానందం, అలీ ఎలాగో అప్పట్లో రాజబాబు అంతకంటే ఎక్కువే పాపులారిటీని సంపాదించుకున్నారు.
Also Read : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!
Advertisement
రాజబాబు అసలు పేరు అప్పల రాజు. ఆయన 1937లో జన్మించారు. 1983లో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రాజమండ్రి స్కూల్ టీచర్ గా పని చేస్తూ.. సినిమాలలో నటించాలని కోరికతో అగ్ర దర్శక, నిర్మాతల పిల్లలకు ట్యూషన్ చెబుతూనే మద్రాస్ లో సినీ ప్రయత్నాలు చేశారు. 1960లో సమాజం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వెనక్కి తిరగకుండా దూసుకుపోయారు. వందల సినిమాల్లో నటించిన ఈయన.. తెలుగు, తమిళం సినిమాల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా పని చేశారు. కోట్లాది రూపాయలను సంపాదించిన రాజబాబు ఎన్నో కష్టాలలు పడి పేదరికం నుంచి ఆస్థాయికి ఎదిగారు.
Also Read : పవన్ కళ్యాణ్ నుంచి దళపతి వరకు వారి కెరీర్ లో అత్యధిక రీమేక్ తీసిన 7 స్టార్ హీరోలు
తనకు ఉన్నంతలోనే చాలా మందిని ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేవారు. ఒకానొక సమయంలో మనిషి రోడ్డున పడ్డాడనే నిర్మాతగా కూడా వ్యవహరించాడు రాజబాబు. ఆ సినిమాతో సంపాదించిన డబ్బునంత పోగొట్టుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఈ సినిమా వల్ల ఆయన రోడ్డున పడ్డారనే చెప్పాలి. డబ్బు ఉన్న సమయంలో ఆయన చెంత చేరిన వారందరూ డబ్బు పోయిన తరువాత ఆయనను పట్టించుకోవడమే మానేశారు. గొంతు క్యాన్సర్ సోకడంతో రాజబాబు 1983లో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కొడుకులు సాప్ట్ వేర్ కంపెనీలకు మెయింటైన్ చేస్తూ.. ధనవంతులుగా విదేశాల్లో సెటిలయ్యారు.
Advertisement
Also Read : Telugu News, Telugu Cinema Tollywood News