Home » కామెడీ స్టార్స్‌లో హైప‌ర్ ఆది జాయిన్ కాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

కామెడీ స్టార్స్‌లో హైప‌ర్ ఆది జాయిన్ కాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ నుంచి త‌ప్పుకున్న వారు చాలా వ‌ర‌కు ప్ర‌స్తుతం సినిమాల్లో బిజీ అవుతున్నారు. లేదంటే స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతున్న కామెడీస్టార్స్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. అక్క‌డ ఇక్క‌డ లేని వారు ఎవ‌రు లేరు. కానీ హైప‌ర్ ఆది ప‌రిస్థితి అదే అయిందా అంటూ కొంద‌రూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే.. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి హైప‌ర్ ఆది త‌ప్పుకుని నెల‌లు గడుస్తోంది. ఆది ఒక్కో కాల్షిట్ ధ‌ర ల‌క్ష నుంచి రెండున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఆది త‌న డేట్ల‌ను ఇంత వృధా ఎలా చేస్తున్నాడో అస‌లు అర్థం కావ‌డం లేదని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వారు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఆది ఏమి చేస్తున్నాడ‌నేది ప్ర‌తి ఒక్క‌రిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

Advertisement

హైప‌ర్ ఆది జ‌బ‌ర్ద‌స్త్‌ వీడితే క‌చ్చితంగా స్టార్ మాలో ప్ర‌సార‌మ‌వుతున్న కామెడీ స్టార్స్‌లో జాయిన్ అవుతాడంటూ చాలా కాలం కింద‌ట ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. కామెడీ స్టార్స్‌లోకి హైప‌ర్ ఆదిని ఆహ్వానించిందే లేద‌ట‌. స్టార్ మా వ‌ర్గాల వారు కాస్త డెప్త్ గా ఆలోచించి పూర్తిగా స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనేది జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ అవుతుంద‌ని అలా కాకూడ‌దనే ఉద్దేశంతో హైప‌ర్ ఆదిని తీసుకోలేదంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్టార్ మా వారికి కామెడీ స్టార్స్‌తో వ‌చ్చే ఆదాయం చాలా త‌క్కువ. అలాంటి స‌మ‌యంలో కామెడీ స్టార్స్‌లో ఆయ‌న‌ను తీసుకుంటే భారీగా పారితోషికం ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో స్టార్ మా వారు తీసుకోలేద‌ని స‌మాచారం.

Advertisement


ఒక‌వేళ హైప‌ర్ ఆది ఎంట‌ర్ అయితే షో రేటింగ్ పెరుగుతుందా అంటే ఏమో డౌటే అన్నట్టుగా అంతా కూడా అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితి నేప‌థ్యంలో కామెడీ స్టార్స్ నుంచి హైప‌ర్ ఆదికి ఆహ్వానం అంద‌లేద‌ని తెలుస్తోంది. హైప‌ర్ ఆది క‌నుక సినిమాలు క‌మిట్ అవ్వ‌డం ప్రారంభిస్తే వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఆయ‌న కాస్త పెద్ద సినిమాను చూసి క‌మిట్ అయితే బెట‌ర్‌. ఎందుకంటే చిన్న చిత‌కా సినిమాలు చేస్తే ముందు ముందు కెరీర్‌లో ఇబ్బందుల‌కు గుర‌వ్వాల్సి వ‌స్తుందంటూ ఆయ‌న అభిమానులు ఇండ‌స్ట్రీ వారు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే హైప‌ర్ ఆది ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కానీ ఆయ‌న‌ను బుల్లితెర‌పై చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : 

వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?

ఈ 5 లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట….ఇందులో మీరూ ఉన్నారా…?

 

Visitors Are Also Reading