Ads
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేర్లు కూడా ఏమో స్పెషల్గ ఉండాలని చాలా ఆలోచించి మరీ పెడుతున్నారు. తాజాగా ఓ జంట తమకు అప్పుడే పుట్టిన బిడ్డకు పెట్టిన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.
Baby Born in India Pakistan Border
అదేవిధంగా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది. వివరంగా చెప్పాలంటే పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట మిగిలిన 97 మంది పాకిస్తానీ లతో కలిసి అటారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. 71 రోజులనుంచి వారు అక్కడే ఉన్నారు వాళ్ల లో నిండు గర్భిణీ కూడా ఉన్నది. గర్భిణీ స్త్రీ డిసెంబర్ 2న భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో పుట్టడం తో పుట్టిన బిడ్డకు బోర్డర్ అని పేరు పెట్టారు. బోర్డర్ అని పేరు పెట్టినట్లు స్వయంగా ఆ బాబు తండ్రి చెప్పారు. బాలన్, నింభు బాయ్ అనే జంట పంజాబ్ జిల్లా లో ఉంటున్నారు. బాలం రాము మీడియాతో మాట్లాడారు. మా భార్య ప్రసవ సమయంలో పక్కనే ఉన్న పంజాబ్ గ్రామాల నుంచి కొంతమంది మహిళలు వచ్చి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారని చెప్పారు. లాక్డౌన్ కు ముందు తమ బంధువులను కలవడానికి వచ్చామని చెప్పాడు రామ్. కేవలం తామే కాదు.. తమతో పాటు ఇతర పాకిస్థానీయులు కూడా 98 మంది చిక్కుకుపోయారని వెల్లడించారు.
India Pakistan Border
వారందరూ అటారి అంతర్జాతీయ చెక్ స్ట్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలం లో ఉన్నారు అక్కడ అక్కడ ఉన్న స్థానికులు తమకు ఆహారం మందులు ఇతర సహాయం అందజేశారనీ చెప్పాడు. ప్రస్తుతము బాలం రాము జంట తమకు పుట్టిన బిడ్డను బోర్డర్ అని పేరు పెట్టడం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది అని నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు.