Home » పెళ్లి చేసుకున్నాక నటి లైలా జీవితం ఇలా అయిపోయింది ఏంటి..?

పెళ్లి చేసుకున్నాక నటి లైలా జీవితం ఇలా అయిపోయింది ఏంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది లైలా. ఎగిరే పావురమా అనే సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె అందమైన నవ్వు తో కనిపించేది.లైలా సినిమాల్లో కూడా ఆ నవ్వుతో అందరి మనసు దోచేసింది. అలాంటి లైలా ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయింది.. మరి ఆమెకు ఏం జరిగింది ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..? నటి లైలా పదవ తరగతి నుంచే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఏదో సరదాగా చేస్తున్న మోడలింగ్ తనను సినిమాల వైపు నడిపించింది. ఆమె తెలుగు ఇండస్ట్రీ లోకి ఎగిరే పావురమా అనే సినిమాతో మొదటి సారి అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం తో, ఇక ఆ సినిమా తర్వాత లైలా ఎగిరే పావురమా సినిమా డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి హీరోగా నటించిన ఉగాది సినిమా లో హీరోయిన్ గా నటించింది. కానీ ఉగాది సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ మూవీ లోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన పెళ్లి చేసుకుందాం రా సినిమా లో వెంకటేష్ మరదలు పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. దీని తర్వాత బాలకృష్ణ పవిత్ర ప్రేమ అనే సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ మూవీ కూడా ఆవరేజ్ గా నిలిచింది. ఇవి కాకుండా ఖైదీగారు, శుభలేఖలు, లవ్ స్టోరీ 1999, హృదయంలో నిదురించే చెలి అనే మూవీస్ లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం,మలయాళ భాషల్లో కూడా నటించి ప్రత్యేక పేరు ను సంపాదించుకుంది. ఈ సినిమాలు చేస్తున్న తరుణంలోనే 2006లో బిజినెస్ మాన్ మెహదీన్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న తర్వాత వివాహం చేసుకుంది లైలా. నిజానికి మెహదీన్ లైలా ను కలవడానికి ప్రధాన కారణం లైలా ఫ్రెండ్ అని చెప్పాలి. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లైలా గారు తమిళ్ ఇండస్ట్రీలో జబర్దస్త్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరి లైలా గారు తన జీవితంలో ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ హ్యాపీ గా ఉండాలని మనం కూడా కోరుకుందాం.

Advertisement

ALSO READ;

Advertisement

ఆ షో చేస్తుండగా హైపర్ ఆది ని మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

నయనతార విగ్నేష్ శివన్ ల పెళ్లి పత్రిక చూస్తే ఫిదా అవుతారు..?

 

Visitors Are Also Reading