మన దేశంలో ఉత్తరాది ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆవేదన దక్షిణాది లో చాలా ఎక్కువగా ఉంది. దక్షినాది రాష్ట్రాల వ్యాపార సామ్రాజ్యాలను ఉత్తరాది వారు ప్రభావితం చేయడమే కాకుండా వారి వ్యాపారాలతో మన సౌత్ లో చిన్న చిన్న వ్యాపారులను చంపేస్తున్నారు అనే భావన ఉంది. ఇక హిందీ భాష విషయంలో వివాదాలు చాలానే ఉన్నాయి. బలవంతంగా దేశం మీద ఆ భాషను రుద్దుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
Advertisement
ఇక దేశ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్న ఒక పెద్ద అబద్ధం… హిందీ మన జాతీయ భాష అనేది. ఇది చాలా మందికి తెలియని వాడుకలో ఉన్న ఒక అతిపెద్ద అబద్ధం. రాజ్యాంగం ప్రకారం మన దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదు… ఉండదు. ఎందుకంటే ఎవరి భాషకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. హిందీ తర్వాత దేశంలో తెలుగు ఎక్కువ మాట్లాడతారు. ఆ తర్వాత తమిళం మాట్లాడతారు… ఒక భాషకు ప్రాధాన్యత ఇచ్చి మరో భాషకు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది…?
Advertisement
కేవలం 5 రాష్ట్రాలకు మాత్రమే హిందీ పరిమితమైంది. ఏ రాష్ట్రానికి ఆ భాష ప్రత్యేకంగా ఉంది. కాని బెంగాలి, పంజాబీ, హర్యాన్వీ, మరాఠీ, గుజరాతి లాంటి భాషలను కూడా హిందీగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చిన్న పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ అబద్ధం మనకు కనపడుతుంది. ఆ అబద్ధం వినే మనం పైకి వచ్చాం. ఇది పచ్చి అబద్ధం అని తెలిసినా సరే ఎవరూ ఎక్కడా చెప్పలేదు. హిందీ అనేది మన దక్షిణాది సహా ఎన్నో రాష్ట్రాల మీద రుద్దే బలవంతపు రుద్దుడు.