ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. తాజాగా పేరు మార్పు పై నందమూరి బాలకృష్ణ ఫైర్ అయిన విషయం విధితమే.జగన్ సర్కారు పై సోషల్ మీడియా వేదికగా సంచలన విమర్శలు చేశారు బాలయ్య. ఈ విమర్శల పై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా విమర్శలు గుప్పించారు.
Advertisement
ఇక మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ బాలకృష్ణ ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా టీడీపీ హయాంలో కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. “ఎన్టీఆర్ ను మీరంతా కలిసి చంపేశాక కదా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది. చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణ” అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై బాలయ్య తనయుడు నందమూరి మోక్షాజ్ఞ స్పందించారు. బాలయ్యను విమర్శించిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞ సంచలన ట్వీట్ చేసాడు.
Advertisement
Also Read : ఎన్టీఆర్-ఏఎన్నార్ ఆరేళ్ల వరకు మాట్లాడుకోలేదట ఎందుకో తెలుసా..?
బాలకృష్ణ మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు మీరు ఎంత చేసినా బాలయ్య ను ఏం చేయలేరని ఘాటుగా స్పందించారు. అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ల దగ్గరికి వచ్చిన వారే అవసరం తీరిపోయిన తరువాత కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెబుతుంది అని మోక్షజ్ఞ ట్వీట్ చేశాడు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. బాలయ్య కొడుకు చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సోషల్ మీడియా వార్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.
Also Read : ఒకే ఒక జీవితం డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?