Home » ఆడ‌పిల్ల‌లు 25 ఏళ్ల వ‌య‌స్సు లో వివాహం చేసుకుంటే..?

ఆడ‌పిల్ల‌లు 25 ఏళ్ల వ‌య‌స్సు లో వివాహం చేసుకుంటే..?

by Bunty

భార‌త ప్ర‌భుత్వం మ‌హిళల వివాహ వ‌య‌స్సు ను 18 నుంచి 21 కి పెంచుతు నిర్ణ‌యం తీసుకున్న నాటి నుంచి ఆడ‌పిల్లల వివాహ వ‌య‌స్సు గురించి సోషల్ మీడియా లలో.. న్యూస్ మీడియాల‌లో.. వార్త పేప‌ర్స్ ల‌లో తెగ చ‌ర్చ న‌డుస్తుంది. ఏ వ‌య‌స్సు లో ఆడ‌పిల్ల‌లు వివాహం చేసుకుంటే మంచిందని చాలా మంది కూడా ప్ర‌శ్నిస్తున్నారు. అయితే దీని పై చాలా మందికి కూడా క్లారిటీ లేదు. ఏ వ‌య‌స్సు లో పెళ్లి చేసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఏ వ‌య‌స్సు లో వివాహం చేసుకుంటే స‌మ‌స్య‌లు ఎదురు అవుతాయి.

అని చాలా మందికి తెలియ‌దు. అయితే ఇప్ప‌డు మ‌నం ఆడ పిల్ల‌లు ఏ వ‌య‌స్సు లో వివాహం చేసుకుంటే ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని తెలుసుకుందాం. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న 21 ఏళ్ల వ‌య‌స్సు అనేది కొంత వ‌ర‌కు అంగీక‌రించాల్సిన విష‌య‌మే. కానీ ఆడ పిల్లల‌కు ఇంకా ప్ర‌యోజ‌నం క‌ల‌గాలంటే వారి వివాహ వ‌య‌స్సు 25 వ‌ర‌కు ఉండాలి. 25 ఏళ్ల వ‌య‌స్సు లో ఆడ పిల్లలు వివాహం చేసుకుంటే వారికి అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అవి ఎంటో కొన్ని చూద్దం. 25 ఏళ్ల వ‌య‌స్సు లో మ‌హిళ‌లకు ఆలోచ‌న విధానంలో చాలా మార్పు ఉంటుంది. ఆ వ‌య‌స్సు లో వారు తీసుకునే నిర్ణ‌యం చాలా ఆలోచింప చేస్తుంది. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. అలాగే 25 ఏళ్ల పై బ‌డిన వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది.

దీంతో వారు ఎక్క‌డికి వెళ్లినా త‌ము ప్ర‌శాంతంగా బ్ర‌త‌క‌గ‌లం అనే దీమా ఉంటుంది. అంతే కాకుండా ఈ వ‌య‌స్సు లో చాలా మంది వారి ల‌క్ష్యాల‌ను సాధించి ఉంటారు. అలాగే చిన్న వ‌య‌స్సు లో వివాహం జ‌రిగిన వారి లో చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. కానీ 25 ఏళ్ల త‌ర్వాత వివాహం చేసుకున్న వారి సంసార జీవితం సాఫీ గా సాగుతుంది. 25 ఏళ్ల పై వారికి ఆలోచ‌న త‌త్వం తో పాటు మాట్లాడే విధానం కూడా బాగా ఉంటుంది. ఇలా 25 ఏళ్ల త‌ర్వాత వివాహం చేసుకున్న వారి జీవితం సాఫీ గా విజ‌య‌వంతం గా సాగుతుంద‌ని ప‌లువురు శాస్త్రవేత్త‌లు వారి స‌ర్వేల‌లో తెలిపారు.

Visitors Are Also Reading