Home » బీరువాకు అద్దం అమ‌ర్చి ఉంటే ఆ సమస్య‌లు త‌ప్ప‌వ‌ట‌…!

బీరువాకు అద్దం అమ‌ర్చి ఉంటే ఆ సమస్య‌లు త‌ప్ప‌వ‌ట‌…!

by AJAY
Ad

ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తుంది. డబ్బు, నగలు, దుస్తులు వీటన్నింటిని బీరువాలోనే దాచుకుంటారు. ఇక బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో బీరువా కు అద్దం ఫిట్టింగ్ చేసి ఉన్న బీరువాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకో కూడదు అని వాస్తునిపుణులు చెబుతున్నారు.

Advertisement

అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు. అద్దం ఉన్న‌ బీరువా కు ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏమిటి అని అనుమానం రావచ్చు… కానీ నీ స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతారు. బయటకు వెళ్లి వచ్చినా… ఎక్కడికి వెళ్లి వచ్చినా అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు.

Advertisement

also read : కరోనా తర్వాత మరో ముప్పు…బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు…?

అయితే అదే బీరువాలో మనం డబ్బు మరియు బంగారాన్ని పెడతాం… కాబట్టి బీరువాలో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తునిపుణులు చెబుతున్నారు. కానీ బీరువా కు అద్దం అమర్చి ఉండటంవల్ల ఆ లక్ష్మి దేవి కటాక్షం ఉండదు అని చెపుతున్నారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి వచ్చి అద్దం చూసుకోవడం వల్ల లక్ష్మి దేవి అక్కడ నుండి వెళ్ళిపోతుందని చెపుతున్నారు. కాబట్టి బీరువా కొనుగోలు చేసే సమయం లో అద్దం అమ‌ర్చిలేని బీరువాల‌నే కొనాలని సలహా ఇస్తున్నారు.

Visitors Are Also Reading