Home » రాజమౌళికి చుక్కలు చూపించిన నెటిజన్స్.. జరిగిందేంటంటే..?

రాజమౌళికి చుక్కలు చూపించిన నెటిజన్స్.. జరిగిందేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎవరికో మేలు చేద్దామని పోతే మనకు కీడు జరిగినట్టు రాజమౌళికి కూడా ఇదే జరిగింది. ఏదో చిన్న సినిమా కదా ప్రమోట్ చేద్దామని సినిమా గురించి పాజిటివ్ గా ఒక ట్విట్ చేశారు.

Advertisement

దీంతో నెటిజన్స్ అంత రాజమౌళి పై రెచ్చిపోయారు. అసలేం జరిగిందంటే.. చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి తాజాగా రిలీజ్ అయిన చిత్రం మేం ఫేమస్. అంతా కొత్త వాళ్ళతో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ బాగానే చేశారు మేకర్స్. ఈ తరుణంలోనే స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా ట్వీట్ చేశారు.

ఆ తర్వాత స్టార్ దర్శకుడు రాజమౌళి కూడా ఈ విధంగానే స్పందించి సినిమా గురించి బాగా చెప్పారు. వీరిద్దరి ట్వీట్లు చూసిన నెటిజెన్లు సినిమా బాగుంది కావచ్చని థియేటర్ల వైపు పరుగులెత్తారు. సినిమా విడుదలైన మొదటి రోజే భారీగా నెగిటివ్ బజ్ వచ్చింది. రివ్యూలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఇలాంటి చిత్రానికి మహేష్,రాజమౌళి వంటి స్టార్ సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.

Advertisement

కొందరైతే డైరెక్ట్ గా పెయిడ్ రివ్యూ అంటూ రాజమౌళిని విమర్శిస్తున్నారు. ఈ చెత్త సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన రాజమౌళికి బలగం సినిమా కనిపించలేదా అంటూ నిలదీశారు. ఇలాంటి ట్వీట్లు చేయడం మానేసి మీ సినిమాలపై దృష్టి పెట్టండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏదో చిన్న సినిమా అని సపోర్ట్ చేస్తే సీన్ రివర్స్ అయింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading