Telugu News » Blog » “ఆనందం” మూవీ హీరో వెంకట్ ఇలా అయ్యారేంటి.. ఏం చేస్తున్నారంటే..?

“ఆనందం” మూవీ హీరో వెంకట్ ఇలా అయ్యారేంటి.. ఏం చేస్తున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంతా సులువైన పని కాదు. ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. నటన టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా ఉంటేనే మనం ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం. శ్రీను వైట్ల దర్శకత్వంలో అప్పట్లో ఆనందం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ద్వారా హీరో వెంకట్ ఎంతో గుర్తింపు సాధించారు. ఆ తర్వాత వెంకట్ 15 పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు.. కానీ కొంత కాలానికి కనుమరు గైపోయారు.  దీనికి ప్రధాన కారణం ఆయన కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడం.

Advertisement

also read:విడాకులు ఇవ్వాల‌ని మూడో భార్య‌కు న‌రేష్ అన్ని కోట్లు ఆఫ‌ర్ చేశాడా..? సంచ‌ల‌న నిజాలు ఇవే..!

Advertisement

దీంతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంవల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అయితే చాలా ఏళ్ల తర్వాత వెంకట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. యాంకర్ మిమ్మల్ని ఓ స్టార్ హీరో అవకాశాలు రాకుండా చేశారట అని అడిగితే.. వెంకట్ సమాధానం చెబుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని తొక్కేయడం అనేది ఉండదు. మన టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటే ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి వెళ్లవచ్చని , దీన్ని నేను బాగా నమ్ముతానని అన్నారు.

అయితే నేను చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ కావడం వల్లే తను హీరోగా రాణించలేకపోయారని చెప్పుకొచ్చారు.. తనకు సినిమాలు కలిసి రాకపోయినా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారం బాగా కలిసి వచ్చిందని అన్నారు. ఈ మధ్యకాలంలోనే ప్రముఖ సోలార్ సంస్థతో పెద్ద డీల్ కుదుర్చుకున్నట్టు తెలియజేశారు. అప్పట్లో వెంకట్ చిరంజీవి, బాలకృష్ణ, జగపతిబాబు, వంటి హీరోలతో కలిసి నటించారు. ఆయన చేసిన ఆనందం మూవీ మాత్రం సూపర్ హిట్ అయింది.

Advertisement

also read: