Home » ఎన్టీఆర్, విశ్వనాథ్ 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు..? కారణం ఏమిటి..?

ఎన్టీఆర్, విశ్వనాథ్ 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు..? కారణం ఏమిటి..?

by Sravya
Ad

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఒక పక్క సినిమాలు ఇంకా పక్క రాజకీయాలతో బిజీగా ఉండేవారు. సినిమా విషయంలో కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వలన దర్శకులకు హీరోలకి మధ్య తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటివి వచ్చిపోతూ ఉంటాయి చాలా సందర్భాల్లో హీరోలకి దర్శకులకి మధ్య ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ విశ్వనాధ్ మధ్యలో వచ్చిన ఒక అగాధం గురించి చాలామందికి తెలియదు.

viswanath-and-ntr

Advertisement

 

వీళ్ళిద్దరూ మొదట్లో మంచి స్నేహితులు కానీ చిన్న విషయం కారణంగా వీళ్ళ మధ్య గొడవ జరిగింది. మళ్లీ జీవితంలో ఎప్పుడూ కూడా కలిసి పనిచేయలేదు. ఎన్టీఆర్ సాధారణంగా తనకి ఎవరైనా అడ్డు చెప్తే లేదా నచ్చని పని చెప్తే దూరం పెట్టేస్తారు. అలాంటి ఒక చిన్న కారణమే వీళ్ళిద్దరి మధ్య కూడా సమస్యను తీసుకొచ్చింది. వాస్తవానికి విశ్వనాధ్ ఎన్టీఆర్ ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు.

Also read:

Advertisement

Also read:

విశ్వనాథ్ కాలేజీలో ఉన్న టైంలో ఎన్టీఆర్ కి ఉద్యోగం వచ్చింది తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు వచ్చారు. ఒకరోజు ఎన్టీఆర్ హీరోగా విశ్వనాధ్ దర్శకుడిగా పని చేస్తున్న మూవీకి ఎమోషనల్ సీన్ వచ్చింది. గ్లాసెస్ పెట్టుకుని సీన్ చేయొద్దు అని విశ్వనాధ్ అన్నారు ఎన్టీఆర్ కి అయితే నచ్చలేదు నాకు ఇలానే బావుంది నేను ఇలానే నటిస్తానని అన్నారు. కానీ విశ్వనాథ్ కి మాత్రం ఆ విషయం నచ్చలేదు. ఇలా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి గొడవ జరిగిన తర్వాత ఎన్టీఆర్ కళ్లద్దాలతోనే నటించారు దాదాపు 20 ఏళ్లకి పైగా వీళ్ళు ఈ విషయం వలన మాట్లాడుకోలేదట.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading