Home » నోకియా ఎత్తు పల్లాల ప్రస్థానం…సెల్ ఫోన్ రంగంలో టాప్ ప్లేస్ నుండి నేలమట్టం అవ్వడానికి కారణాలు ఇవే…!

నోకియా ఎత్తు పల్లాల ప్రస్థానం…సెల్ ఫోన్ రంగంలో టాప్ ప్లేస్ నుండి నేలమట్టం అవ్వడానికి కారణాలు ఇవే…!

by AJAY
Ad

నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తం లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగం లో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తం లో అత్యధికం గా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభం లో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటం తో ప్రపంచ మార్కెట్ లో నోకియా 50% నుంచి 5% వరకు పడిపోయింది. 2011 లో మార్కెట్ విలువ కూడా 90% పడిపోయింది.

Advertisement

నిజానికి స్మార్ట్ ఫోన్ మొదట తెచ్చింది నోకియా నే. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం తో టచ్ స్క్రీన్ తెచ్చింది నోకియా నే. కానీ సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం టచ్ స్క్రీన్ కాని వాటిల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది, 2008 లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వైపు వెళ్ళాలని చెప్పినా నా కంటే ఎక్కువ తెలుసా..? అని పై స్థాయి మేనేజ్ మెంట్ & CEO పట్టించుకోలేదు. 2010 లో ఒల్లి పెక్కా ని CEO గా తీసి స్టెఫన్ ఎలాఫ్ ని CEO గా చేసారు.

Advertisement

అతను 2011 లో నోకియా లో ఆపరేటింగ్ సిస్టం గా మైక్రోసాఫ్ట్ విండోస్ ని నోకియా ల్యుమియా ఫోన్స్ లో వాడారు. ఆ తర్వాత మొత్తం క్షీణ దశకి చేరుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ 2013 లో నోకియా ని అక్వైర్ చేసింది, ఇది ఇంకో పెద్ద మిస్టేక్. ప్రపంచం లోని బిజినెస్ స్కూల్స్ నోకియా పతనాన్ని స్టడీ చేసినట్లు గా నాకు తెలిసి దేన్నీ స్టడీ చేయలేదు. పతనానికి కారణాలు గా వాళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటి అంటే “మితిమీరిన అహంకారం”; “అన్నీ నాకే తెలుసు” అన్న మనస్తత్వం. క్రింది స్థాయి వాళ్ళకి తెలుసు క్షీణిస్తుంది అని, కానీ హైయర్ మేనేజ్ మెంట్ కి & CEO కి చెప్పాలంటే భయం. చుట్టు పక్కల వ్యక్తులు ఎవరూ CEO కి వాస్తవ పరిస్థితి వివరించలేదు, అతనూ మూర్ఖత్వం తో వాస్తవాలని తెలుసుకోలేదు. చివరికి సర్వ నాశనమై ప్రపంచ మొబైల్ మార్కెట్ లో 1-3% ఉంది ఇప్పుడు.

ఈ విషయాన్ని గ్రహించే 2013-2014 లో మైక్రోసాఫ్ట్ CEO గా తాను వైదొలగి సత్య నాదెళ్ళ ని CEO గా చేశాడు బిల్ గేట్స్. మన దేశం లో టాటా, బిర్లా లని తీసుకున్నా బిర్లాలు పడిపోయారు కానీ టాటా ఎప్పుడూ ఒకో మెట్టు పైకి ఎదుగుతూ వస్తున్నారు. కారణం తమ కాంపౌండ్ లోని వ్యక్తి ని కాకుండా బయటి వ్యక్తి ని CEO గా కూడా చేసింది టాటా. ఏది ఏమైనా కాలం తో పాటు అప్ డేట్ అయిన వ్యక్తులు, సంస్థలు మనగలుగుతున్నాయి. మితిమీరిన అహంకారం ఉన్న వ్యక్తులు, సంస్థలు సర్వనాశనమవుతున్నై/అవుతాయి.

– జగన్
(వ్యక్తిగత అభిప్రాయం)

Visitors Are Also Reading