Home » ముహూర్తం సమయానికి పెళ్లి జరగకపోతే….వ‌ధూవ‌రుల‌కు వ‌చ్చే ఈ ప్ర‌మాదాలు ఏంటంటే..?

ముహూర్తం సమయానికి పెళ్లి జరగకపోతే….వ‌ధూవ‌రుల‌కు వ‌చ్చే ఈ ప్ర‌మాదాలు ఏంటంటే..?

by AJAY
Ad

హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సాంప్ర‌దాయాలు ఉంటాయి. ఈ ఆచారాలు సాంప్ర‌దాల వ‌ల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఆచార సాంప్ర‌దాయాల వెనుక ఎంతో అర్థం కూడా ఉంటుంది. ముఖ్యంగా హిందువులు ఏ పనిచేయాల‌న్నా ముందు ముహూర్తం చూసుకుంటారు. ఏదైనా వాహ‌నం కొనాల‌న్నా ఇంట్లో ఏదైనా వేడుక జ‌రిపించాల‌న్నాముందు మంచి ముహూర్తం చూసుకుంటారు. పుట్టుక నుండి చావు వ‌ర‌కూ ప్ర‌తిదీ ముహూర్తం ప్ర‌కార‌మే జ‌రిపిస్తుంటారు.

Advertisement

ఇక జీవితంలో అతిముఖ్య‌మైన పెళ్లి విష‌యంలో ముహూర్తానికి మ‌రింత ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే ఒక‌ప్పుడు ఎక్కువ‌గా రాత్ర‌ళ్లు ముహూర్తం పెట్టి వివాహాల‌ను జ‌రిపించారు. కానీ ఇప్పుడు ఎక్కువ‌గా ఉద‌య‌మే ముహూర్తాల‌ను పెట్టి పెళ్లిళ్లు జ‌రిపిస్తు్న్నారు. అంతే కాకుండా అప్ప‌ట్లో ముహూర్తానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ప‌లానా స‌మ‌యానికి పెళ్లి జ‌ర‌గాలంటే అదే స‌మ‌యానికి జరిపించేవారు.

Advertisement

కానీ ఇప్పుడు పంతులు చెప్పిన‌ ముహూర్తానికి పెళ్లి జ‌రిగే స‌మ‌యానికి అస‌లు సంబంధ‌మే ఉండ‌దు. అయితే ముహూర్తం దాటి పెళ్లి జ‌రిపిస్తే ఏం జ‌రుగుతుంది అనే విష‌యంలో ఓ ప్ర‌ముఖ జోతిష్య నిపుణులు ఆసక్తిక‌ర విష‌యాల‌ను వెళ్ల‌డించారు. పెళ్లి చేసుకోబోయే జంట జాత‌కాన్ని బ‌ట్టి వారు ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది..ఏ ముహూర్తంలో చేసుకుంటే సంతానం క‌లుగుతుంది.

అష్ట ఐశ్వర్యాలు ఆ జంట‌ను వ‌రిస్తాయి అనేదాన్ని బ‌ట్టి పెళ్లి ముహూర్తాన్ని నిర్ణ‌యిస్తార‌ట‌. కానీ ఇప్పుడు అలంక‌ర‌ణ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ ముహూర్తాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. అలా చేయ‌డం వ‌ల్ల వివాహ బంధానికి బ‌లం ఉండ‌ద‌ట‌. సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డం..గొడ‌వ‌లు రావ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉటుంద‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : రియల్ స్టార్ శ్రీహరి చివరి రోజుల్లో ఎంతటి నరకం అనుభవించారంటే..? అరుపులు, కేకలు…!

Visitors Are Also Reading