సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది. అక్కడ స్టార్ ఉన్నంత సేపే పక్కన మనుషులు ఉంటార్న కారణంతో చాలా మంది సెలబ్రెటీలు ఫంక్షన్ లకు ఇతరులతో క్లోజ్ ఉండేందుకు ఇష్టపడరు. ఇక ఇండస్ట్రీలో చాలా క్లోజ్ గా ఉండే వారిలో ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కూడా ఉంటారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన చాలా సినిమాలలో రాజీవ్ కనకాల ముఖ్యమైన పాత్రలలో నటించాడు.
Advertisement
వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమాలో ఓ సీన్ హైలెగ్ గా నిలిచింది. అయితే చాలా కాలం నుండి వీరిద్దరూ కలిసి సినిమాల్లో కనిపించడం లేదు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్లే వీరిద్దరు కలిసి సినిమాలలో కనిపించడం లేదని కూడా గాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై రాజీవ్ కనకాల నారప్ప సినిమా విడుదల తరవాత ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
Advertisement
ఎన్టీఆర్ తో నాకు విభేదాలు ఉన్నాయన్న వార్తలు నేను కూడా చూశాను. కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నేను కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం వల్లనే ఎన్టీఆర్ సినిమాల్లో నటించలేకపోయాను. ఎన్టీఆర్ నన్ను తన సినిమాలలో తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. దానికి కారణం నాతో నటించడం ఎన్టీఆర్ కు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని భావిస్తాడు.
అంతే కాకుండా నా కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని కూడా దర్శకులకు సూచిస్తాడు. కానీ నా కోసం దర్శకులను ఇబ్బందిపెట్టవద్దని నేనే చెప్పాను. అందువల్లే తారక్ సినిమాలలో నేను కనిపించడం లేదు. అంటూ రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో గొడవలు అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు.