Home » విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారంటే..?

విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

ఇటీవల షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన నటుడు విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని వస్తున్న వార్తల గురించి అందరికీ తెలిసిందే. తాజా సమాచారం మేరకు..  ఆయన చాలా క్రిటికల్ స్టేజ్ దాటినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలోకి  మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేశారు విజయ్ ఆంటోని.  సింగర్ గా ఎన్నో పాటలు పాడిన విజయ్ ఆంటోనీ మాటల రచయితగా.. ఎడిటర్ గా పలు సినిమాలకు పని చేశారు. ఇక ముందుగా కొన్ని సినిమాల్లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చిన విజయ్ అంటోని ‘నాన్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఆ తరువాత  సలీం, ఇండియా పాకిస్తాన్, బిచ్చగాడు, బేతాళుడు, ఎమాన్, అన్నాదుర్తె, కలి, తిమిరు బుడిచవన్, ఖోలక్కరన్, కోడియిల్, ఒరువన్ వంటి  పలు సినిమాల్లో నటించారు.  

Advertisement

విజయ్ ఆంటోని ఇప్పటి నటించినటువంటి అన్ని సినిమాలు దాదాపుగా తెలుగులో కూడా విడుదల అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ కక్కి పిచైకారన్ 2, ఖోలా, రత్తం, బోరి పట్టాడ మన్మన్, వల్లి మయిల్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ ఆంటోనీ మలేషియాలో ‘పిచైకారన్ 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ సమయంలో లంకావి ద్వీపం దగ్గరలోని సముద్రంలో స్త్రె జెట్ వాహనాన్ని నడుపుతుండగా విజయ్ ఆంటోనీ ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనతో పాటు పడవలోని ఉన్న నటి కావ్య థాపర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. విజయ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని.. పెదవి పగిలిపోవడంతో పాటు పళ్ళు విరిగిపోయినట్టు  తెలుస్తోంది. 

Advertisement

Also Read :  విజయ్ తో రిలేషన్ షిప్ పై స్పందించిన రష్మిక….తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు…!

ఇక ఈ ప్రమాదంతో తమిళ సినీ పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయి నీటిలో మునిగిపోయిన విజయ్ ఆంటోనీని చిత్రబృందం రక్షించి..  సమీపంలోని  ఆస్పత్రిలో చేర్పించింది. ఫస్ట్ ఎయిడ్ అయ్యాక ఆయనని మలేషియా రాజధాని కౌలాలంపూర్ తీసుకెళ్లారని.. అక్కడ ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే క్రిటికల్ స్టేజ్ దాటినట్లు చెబుతున్నారు. నోటి కింద భాగం పూర్తిగా దెబ్బ తినడంతో విజయ్ అంటోనీకి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోనీ కుటుంబ సభ్యులు జనవరి 18న కౌలాలంపూర్ చేరుకున్నారు.  ఇక విజయ్ ఆంటోనీని కుటుంబ సభ్యులు ఈరోజు  రాత్రి వరకు చెన్నైకి తీసుకురానున్నట్లు సమాచారం.  చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరబోయే విజయ్ అంటోనీకి వెంటనే సర్జరీ చేస్తారని  సమాచారం. 

Also Read :  బుల్లితెర పై కళ్యాణ్ రామ్ రికార్డు.. మొదటి మూవీగా బింబిసార..!

Visitors Are Also Reading