Home » రాడిస‌న్ ప‌బ్ ఘ‌ట‌న‌పై రామ్ గోపాల్ వ‌ర్మ ఏమ‌న్నారంటే..?

రాడిస‌న్ ప‌బ్ ఘ‌ట‌న‌పై రామ్ గోపాల్ వ‌ర్మ ఏమ‌న్నారంటే..?

by Anji

ఇటీవ‌ల పోలీసులు బంజారాహిల్స్‌లోని ర్యాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌బ్‌లో ఉన్న 150 మందికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ ప‌బ్ ఘ‌ట‌న‌పై ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడిగా పేరున్న రామ్‌గోపాల్ వ‌ర్మ ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు.


ఆర్జీవీ ఓ ఇంట‌ర్వ్యూలో రాడిస‌న్ ఘ‌ట‌న‌పై మాట్లాడారు. ప్ర‌స్తుతం స‌మాజంలో Dra&గ్స్ వాడ‌డం అనేది చాలా కామ‌న్ గా మారింది. టాలీవుడ్ కేసుతో పోల్చితే ఇది చాలా చిన్న‌ది. మిగ‌తా కేసుల‌తో పోల్చితే ఇది ఒక చిన్న షార్ట్ ఫిలిం లాంటిద‌ని చెప్పుకొచ్చారు వ‌ర్మ‌. ముంబైలో నా అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ టీ తాగినంత ఈజీగా Dra&గ్స్ తీసుకునే వారు. ఇది అక్క‌డ స‌ర్వ‌సాధార విష‌యం. నేను వాటిని వాడ‌ను. ఒకేసారి మాత్రం అవి ఎలా ఉంటాయో ట్రై చేశాను. ఆ త‌రువాత మ‌ళ్లీ వాటి జోలికి వెళ్ల‌లేదు.. ముట్టుకోలేద‌ని చెప్పారు వ‌ర్మ‌.

ప్ర‌స్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఎప్ప‌టి మాదిరిగానే ఈ వ్యాఖ్య‌లు కూడా వివాదానికి దారి తీస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read :  గ్రూప్‌-1, 2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్ష‌ణ‌తో పాటు స్టైఫండ్‌

Visitors Are Also Reading