Home » “లేడీస్ టైలర్” సినిమా గురించి డైరెక్టర్ వంశీ ఏమన్నారంటే..?

“లేడీస్ టైలర్” సినిమా గురించి డైరెక్టర్ వంశీ ఏమన్నారంటే..?

by Sravanthi
Ad

లేడీస్ టైలర్ ఈ సినిమా రిలీజ్ 25 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం సృష్టించింది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ మామూలుగా లేదు. అయితే ఈ మూవీలో 24-14-100 లేడీస్ టైలర్ కి మాత్రమే తెలిసిన కొలతలు.. ఇరవై నాలుగు విభాగాలు.. 14 రీళ్ల వినోదం పండించడానికి ప్రయత్నం చేస్తే థియేటర్ లో 100% నవ్వులు విరబూశాయి.. అది లేడీస్ టైలర్ సినిమా జమజచ్చ కోసం సుందరం సుజాత వెంట బొంగరంలా ఎలా తిరిగాడో సీతా రాముడు, బట్టల సత్యం కన్నా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. ఎందుకంటే హాస్య ప్రియుల ఇళ్లల్లో ఆరిగిపోయిన లేడీస్ టైలర్ డీవీడీ ఉంటుంది.

 

Advertisement

అందులో వచ్చే ప్రతి మాట గుర్తే.. దీనికితోడు సినిమా ఇలయరాజా పాటలు ఎంతో అలరించాయి. ఈ మూవీతోనే దర్శకుడు వంశీ నవ్వుల బాటపట్టారు అని చెప్పవచ్చు. ఆయనతో పాటుగా ప్రయాణం చేసి ఆ టైలరును ముస్తాబు చేశారు తనికెళ్ల భరణి.. రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ విడుదలై పాతిక సంవత్సరాలు అయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు డైరెక్టర్ వంశీ .. ఏంటో చూద్దాం..?
నేను తీసినటువంటి “సీతరా” మూవీ చూసి విజయవాడకు చెందిన ముగ్గురు స్నేహితులు నాతో సినిమా తీద్దామని వచ్చారు. వాళ్లే రవికిషోర్, తమ్ముడు సత్యం, సాయి బాబా ఆలాపన సినిమా షూటింగ్ సమయంలో వస్తే వాళ్లకు కథ చెప్పాను.

Advertisement

సంగీతమే ప్రధానంగా పునర్జన్మ నేపథ్యంలో ఇది ఉంటుంది. కమల్ హాసన్ హీరోగా అయితే బాగుంటుంది అనుకున్నాం. దీంతో నిర్మాతలు వెళ్లి సంప్రదించగా ఏడాది వరకు ఖాళీ లేదని చెప్పారు ఆయన. దీని తర్వాత లేడీస్ టైలర్ కథ చెప్పాను. ఇందులో సుందరం పాత్రకు రాజేంద్రప్రసాద్ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతారని ఆయనని తీసుకొచ్చాం. ఆ సమయంలో మన పల్లెల్లో ఎక్కువగా అరుగు మీద మిషన్ పెట్టుకొని కుట్టే టైలర్ లు ఎక్కువగా కనిపించేవారు. మా పసలపూడిలో ముమ్మిడివరపు త్యాగరాజు అనే టైలర్ ఉండేవాడు. అలాంటి వ్యక్తే ఈ కథలోని సుందరం. ఈ విధంగా ఆ సమయంలో భారీ స్థాయిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు డైరెక్టర్ వంశీ. ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

also read;

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

రాజ‌మౌళి సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్‌..! ఈ క్రేజీ అప్‌డేట్ నిజ‌మేనా..?

 

Visitors Are Also Reading