Telugu News » Blog » Dasara Movie Director Srikanth Odela: ఫస్ట్ సినిమాతోనే సక్సెస్.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంతకు ముందు ఏం చేశాడు ? 

Dasara Movie Director Srikanth Odela: ఫస్ట్ సినిమాతోనే సక్సెస్.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంతకు ముందు ఏం చేశాడు ? 

by Anji
Published: Last Updated on
Ads

Dasara Movie Director Srikanth Odela: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది.

Advertisement

Dasara Movie Director Srikanth Odela

మార్చి 30న పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ సునామీనే సృష్టించింది. అంతేకాదు..గత సినిమాల కంటే..  ఊరమాస్ పాత్రలో అదురగొట్టాడు. వెన్నెల పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. 

Also Read :  ఇలా ఎందుకు జ‌రిగిందా అని బాధ‌ప‌డుతుంటా..మ‌నోజ్ విష్ణు గొడ‌వ పై స్పందించిన‌ పెద‌రాయుడు..!

Dasara Movie Director Srikanth Odela

Dasara Movie Director Srikanth Odela

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే చర్చించుకోవడం విశేషం. ప్రధానంగా నాని నటనతో పాటు దర్శకుడి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంతోనే దర్శకుడిగానే వెండితెరకు పరిచయం అయినా శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. భారీ కలెక్షన్లలో దూసుకుపోతున్న దసరా సినిమాకి టేకింగ్ విషయంలో టెక్నికల్ అంశాల విషయంలో శ్రీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్ లో అందరి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ కి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రాబోతున్నట్టు తెలుస్తోంది.శ్రీకాంత్ ఓదెలా ఎవరు ? దసరా చిత్రం ఆయనకు ఫస్ట్ సినిమా కాదు అన్నట్టుగా తెలుస్తోంది. 

Advertisement

Also Read :  హిందీ ప‌రిశ్ర‌మ‌లో విలువ‌లు లేవు..హీరోయిన్ కాజ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

దీంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు సినీ ప్రియులు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు సుకుమార్ శిష్యుడే. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్  డైరెక్టర్ గా పని చేశాడు.  కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తి శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి సినిమా నిర్మాణం, స్క్రీన్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉండటంతో సినీ రంగంవైపు అడుగులు వేశాడు. 2016లో టూ పాదర్ విత్ లవ్ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు దసరా మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 

Advertisement

Also Read :   రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

You may also like