సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్ లో ఫర్ ఫ్యూమ్స్, సెంట్ బాటిళ్లు, టాల్కమ్ ఫౌడర్స్ విక్రయాలు జోరుగా సాగుతాయి. దీనికి కారణం ఎండాకాలంలో మనిషి శరీరం నుంచి వచ్చే దుర్వాసన. ప్రపంచంలో కోట్లాది మంది నివసిస్తున్నారు. ప్రతీ మనిషి శరీర వాసన భిన్నంగా ఉంటుంది. కొందరికీ తక్కువ శరీర దుర్వాసన ఉంటుంది. మరికొందరికీ వేసవిలో వారి వద్ద నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. శరీరం ఇలా వాసన ఎందుకు వస్తుంది. ఈ వాసనకు చెమట మాత్రమే కారణమా ? మరేదైనా కారణం ఉందా ? శరీరం దుర్వాసన వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
శరీరం దుర్వాసన అనేది కేవలం వేసవికాలంలోనే కాదు.. చలికాలంలో కూడా వస్తుంటుంది. అయితే ఈ వాసన చలికాలంలో ఎక్కువగా దుస్తులు ధరించడం వల్ల దుర్వాసన బయటికీ రాదు. వాస్తవానికి ప్రతీ మనిషి శరీరం నుంచి వచ్చే వాసన వెనక కొన్ని ప్రత్యేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ప్రతీ మనిషి శరీరంపై పలు రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అవి మనిషి చెమటతో కలిసినప్పుడు వాటి వాసన చాలా ఎక్కువగా వస్తుంది. దీంతో మీ పక్కన నిలుచున్న వారికి కూడా ఆ దుర్వాసన వస్తుంటుంది.
Advertisement
ఈ భూమిపై కోట్లాది మంది మనుషులు ఉన్నట్టుగానే కోట్లాది బ్యాక్టీరియాలు కూడా జీవిస్తున్నాయి. పలు రకాల బాక్టీరియా శరీరం నుంచి వెలువడే వివిధ వాసనలకు కారణం. ఒకరి శరీరం నుంచి చాలా దుర్వాసన వస్తుంటే.. దానికి కారణం FMO3 జన్యువులోని లోపం కావచ్చు. మరోవైపు కొంత మంది వ్యక్తుల శరీరంనుంచి వచ్చే దుర్వాసనకు ఫిష్ స్మెల్ సిండ్రోమ్ కారణం అయి ఉంటుంది. సైన్స్ భాషలో దీనిని ట్రిమెథెలామినూరియా అంటారు. ఈ పరిస్థితి మీరు ఎదుర్కుంటున్నట్టయితే.. వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. ఇది కాల క్రమేణా శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Chanakya Niti : వీరు విజయం సాధించేందుకు ఉపయోగపడే లక్షణాలు ఇవే..!
బరువు తగ్గాలనుకుంటే.. ఈ కాఫీ డైట్ తో సులభంగా తగ్గించుకోవచ్చు..!