మన భారత్ లో చాలా మంది ఇళ్లల్లో నేలపై కూర్చొని భోజనం చేస్తారు. అయితే.. ఇటీవల ఈ ట్రెండ్ మారుతూ వస్తోంది. డైనింగ్ టేబుల్స్ పైనా, టివి ముందు సోఫాలో కూర్చుని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఇది సౌకర్యాన్నిచ్చినా, నేలపై కూర్చుని తినేటంత ఉత్తమమైనది మాత్రం కాదు. మనం నేలపై కూర్చున్నప్పుడు మన కాళ్ళు అడ్డంగా పెట్టబడి ఉంటాయి. కుర్చీలో కూర్చుని తింటున్నప్పుడు మన కాళ్ళు నిలువుగా ఉంటాయి. అందుకే కింద కూర్చుని తినడమే ఉత్తమమైన పద్ధతి. దీనికి ప్రత్యేకమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి.
Advertisement
కింద కూర్చుని తినడం వలన పొట్ట చుట్టూ ఉన్న కండరాలకు నొప్పి రాకుండా ఉంటుందట. అలాగే.. పొట్టపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుందట. టేబుల్స్ పై తినడం అందరికి అలవాటు అయిపోతోంది కానీ.. నేలపై కూర్చుని తినడం వలన ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుంది. నేలపై కూర్చుని తినడం మంచి శరీరాకృతి ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా వివిధ రకాల శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుంది. మన పూర్వీకులంతా నేలపై కూర్చుని తిన్నవారే. వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. ఎంత ఎక్కువ కాలం జీవించారో తెలిసిందే.
Advertisement
నేల మీద కూర్చుని తిన్నప్పుడు జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా తింటున్నప్పుడు మనం వంగి తినడం, ఆహారాన్ని నమలడం బాగా చేస్తాము. ఫలితంగా, శరీరంలో ఆమ్లాలు బాగా ఉత్పత్తి అయ్యి ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు నేలపై కూర్చుని తినడం వలన తినాల్సినంత ఆహరం మాత్రమే తీసుకుని బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. నేలపై కూర్చున్నప్పుడు కాళ్ళు అడ్డంగా మడుచుకుంటాము. దీనివలన కండరాలు బలంగా ఉండడమే కాకుండా శరీరం చురుకుగా కూడా ఉంటుందట.
మరిన్ని..
త్రివిక్రమ్ కథ విని నిద్రపోయిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమాకేనా..?
బిగ్ బాస్ లోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ..?
బిగ్ బాస్ 7 సీజన్ కి నాగార్జున రెమ్యునరేషన్ అంత తీసుకున్నాడా ?