మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగరీత్యా ఆఫీసులో ఉండి ఉండి ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతారు.. ఇంటికి వచ్చి బాగా తిని హాయిగా నిద్ర పోతూ ఉంటారు. దీనివల్ల వారికి పోట్ట పెరగడమే కాకుండా, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు వస్తాయి.. కాబట్టి ప్రతి ఒక్కరు తిన్న తర్వాత కొంత సేపు వ్యాయామం చేస్తే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే కొంత మంది వ్యాయామం చేయడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే వ్యాయామం చేస్తే ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటామని, దాని కోసం కొంత మంది ఉదయాన్నే మరికొంతమంది సాయంత్రం వేళ వాకింగ్ కి వెళ్తుంటారు..
Advertisement
అయితే కొంతమందికి సమయం దొరకక ఎలాంటి వాకింగ్ చేయరు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని నిమిషాల పాటు ఈ విధంగా నడిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు అది ఏంటో ఒక సారి చూద్దాం..
వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. భోజనం చేసిన తర్వాత నడిస్తే శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే శరీరంలో అదనపు కేలరీలు కరిగించడం పై దృష్టి సారించాలి..
Advertisement
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. దీనివల్ల మీరు సులభంగా బరువు తగ్గవచ్చు..బరువు తగ్గటమే కాకుండా భోజనం చేసిన తర్వాత నడిస్తే రక్తపోటు, మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అందుకే ప్రతిరోజు తిన్న తర్వాత కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ALSO READ:
- మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్ ఎక్కువ ధరకు అమ్మడానికి గల కారణం చెప్పిన పీవీఆర్ సంస్థ అధినేత..!
- హృతిక్ రోషన్ పై నెటిజన్లు గరం గరం.. ముందు నీ సినిమా సంగతి చూస్కో..!