భారత గణతంత్ర దినోత్సం సందర్భంగా కేంద్రప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించినది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్జీ కి భారత విశిష్ట పురష్కారం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భట్టాచార్జీ పద్మ భూషణ్ స్వీకరించడానికి నిరాకరించారు. పద్మభూషణ్ అవార్డును స్వీకరించబోను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పద్మభూషణ్ అవార్డు గురించి నాకు ఏమి తెలియదు. దీని గురించి ఎవరూ నాకు ఏమి చెప్పలేదు. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే నేను తిరిగి ఇచ్చేస్తానని ఆయన స్పష్టం చేసారు.
Advertisement
బుద్దదేవ్ భట్టాచార్య ప్రస్తుతం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు చెందిన నేతలు ఎవ్వరూ కూడా ఇలాంటి అవార్డు తీసుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబస్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చర్చ జరిగింది. కానీ అతను కూడా నిరాకరించారు. అదే సమయంలో ప్రభుత్వ వర్గాలు అతని ఎత్తుగడను రాజకీయ స్టంట్ గా పేర్కొన్నాయి. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు గురించి కేంద్ర ప్రభుత్వ అధికారి ఉదయాన్నే అతని కుటుంబానికి తెలియజేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో అతని భార్య అధికారిని కలిసారు. అవార్డు తిరస్కరణకు సంబంధించి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాయయంత్రమే అవార్డులను ప్రకటించారు.
Advertisement
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో 128 మంది పేర్లను పద్మ అవార్డులు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరిల నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి భట్టాచార్య పద్మభూషన్, విక్టర్ బెనర్జీ పద్మ భూషణ్, ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్ పద్మ శ్రీ, సంఘమిత్ర బందోపాధ్యాయ పద్మ శ్రీ, కాజీసింగ్ పద్మ శ్రీ, కాలిసోద సోరెన్ పద్మ శ్రీలకు ఎంపికయ్యారు. బుద్దదేవ్ భట్టాచార్జీతో పాటు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను పద్మభూషణ్, మాజీ హోం కార్యదర్శి రాజ్ రాజీవ్ మెహ్రిషి పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు. వీరితో పాటు మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు ఒకటి. పద్మ విభూషన్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ అసాధారణమైన విశిష్టమైన సేవకు ప్రదానం చేస్తుంటారు. పద్మ విభూషణ్ అసాధారణమైన విశిష్టమైన సేవకు.. పద్మ విభూషణ్ హై ఆర్డర్ విశిష్ట సేవకు పద్మ శ్రీ ఆయా రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు ఈ అవార్డులను ప్రకటిస్తారు.