రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 30.10.2022 నుండి 05.11.2022 వరకు
మేషం :
Mesha
విఘ్నాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం అవసరం. చంచలత్వం లేకుండా పనుల్ని పూర్తి చేయాలి. ఆవేశం పనికిరాదు. శాంతం ఫలితాన్ని ఇస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. ఇంట్లో వారి సలహాలు పనిచేస్తాయి. తొందర పాటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారంలో నష్టం కలుగుతుంది. ఖర్చులు అధికం అవుతాయి.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
కార్యసిద్ధి విశేషంగా ఉంది. వ్యాపారం కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కాలం సహకరిస్తోంది. అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
మనోబలం ముందుకు నడిపిస్తుంది. అదృష్ట యోగం ఉంది. స్పష్టత అవసరం. దేనికి సందేహం పనికిరాదు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. తోటి వారి సహకారం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త. స్వయంగా పర్యవేక్షిస్తే లాభం ఉంటుంది. తొందర వద్దు. ప్రతిభతో అభివృద్ధిని సాధిస్తారు.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
అద్భుతమైన విజయం ఉంది. ఉద్యోగంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తే కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. గ్రహబలం బాగుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వృద్ధి బాగుంటుంది. భూ, గృహ, వాహనాది సౌకర్యాలుంటాయి.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఉద్యోగంలో అధికార యోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో మంచి భవిష్యత్తును సాధించగలరు. స్వల్ప విఘ్నాలున్నా ఉన్న ఫలితం అనుకూలం. స్వయంగా పనులు చేసుకోండి. ధర్మబద్ధంగా ముందడుగు వేయండి. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంట్లో వారితో ఆనందాన్ని పంచుకుంటారు.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
అదృష్టకాలం నడుస్తోంది. ఉత్సాహంగా పని మొదలు పెట్టండి. సద్భావనతో ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ధర్మదేవతానుగ్రహంతో పోయినవి తిరిగి వస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార యోగం బ్రహ్మాండం. స్పష్టంగా నిర్ణయం తీసుకోండి.
Weekly Horoscope in Telugu : తుల
Thula
ముఖ్య కార్యాలను శ్రద్దగా చేయాలి. పొరపాటు వల్ల నష్టం ఎక్కువవుతుంది. ఇబ్బందులు తాత్కాలికమే. శుభయోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. అపోహలకు తావివ్వద్దు. సర్దుకుపోవటం మంచిది. ప్రతిదీ మనసుకు తీసుకోవద్దు. వారం మధ్యలో ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. కలసికట్టుగా ఉంటే విజ్ఞాలు తొలగుతాయి. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి.
Advertisement
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఉద్యోగంలో అధికార ప్రశంసలు ఉంటాయి. మనసు స్థిరంగా ఉండాలి. వ్యాపార బలము అద్భుతము. కాలం కలిసి వస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గతంలో ఆయన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సంపదలో వృద్ధి చెందుతాయి.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
కాలానికి అనుగుణంగా ముందుకు సాగండి. ప్రతి చర్య అభివృద్ధి దిశగానే ఉండాలి. శాంతంగా ఆలోచించాలి. గౌరవము పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వ్యాపారంలో మేలుకోవాలి చాలా అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరైన నిర్ణయంతో సమస్య తొలగుతుంది.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
అదృష్టము కలిసొస్తుంది. సకాలంలో మీరు పని చేస్తే మీకు సానుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. పొదుపు చాలా అవసరం. బంధుమిత్రుల అభినందనలు ఉంటాయి. వ్యాపారము మిశ్రమంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న ఒక పని విజయవంతంగా పూర్తి అవుతుంది. కుటుంబ పరంగా అభినందించే అవకాశం ఉంది.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
మంచి పనులు చేసి విజయం సాధించండి. మనోబలము సంపూర్ణంగా ఉంటుంది. సందేహిస్తే విఘ్నం పెరుగుతుంది. మొహమాటం వల్ల సమస్య పెద్దది కాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఇంట్లో వారి సూచనలు చాలా అవసరం.