Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్పుల బాధ నుంచి బ‌య‌ట‌ప‌డతారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్పుల బాధ నుంచి బ‌య‌ట‌ప‌డతారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 28.08.2022 నుండి 03.09.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ప‌లు విధాలుగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. స‌మ‌యానుకూలంగా స్పందించండి. తొంద‌పాటు వ‌ద్దు. లోతైన అవ‌గాహ‌న‌తో ల‌క్ష్యాన్ని చేర‌వ‌చ్చు. ఉద్యోగంలో తెలియ‌ని ఇబ్బంది ఉంది. ఏకాగ్ర‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. పోటీత‌త్వం అవ‌స‌రం. అప్పుడే మంచి భ‌విష్య‌త్ ను సాధించ‌గ‌ల‌రు. అవ‌స‌రాల‌క‌నుగుణంగా ధ‌నం స‌మ‌కూరుతుంది. అప్పుల బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అదృష్ట ఫ‌లితాలు అందుతాయి. త‌గిన ప్ర‌య‌త్నం చేయండి. ఆత్మాభిమానంతో వ్య‌వ‌హ‌రించండి. అధికారుల గుర్తింపు ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త‌గా ఆలోచించాలి. కొన్ని సంద‌ర్భాల్లో అనుకున్న‌దొక‌టి. జ‌రుగుతున్న‌ది వేరొక‌టి అనిపిస్తుంది. శాంత‌మే ర‌క్ష అన్న‌ట్టుగా న‌డుచుకోవాలి. ఆనందించే అంశాలు ఉన్నాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

శుభ ఫ‌లితాలు సాధించే కాలం ఇది. ప‌నుల‌ను జాగ్ర‌త్త‌గా పూర్తి చేయాలి. ప్ర‌తీ అంశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ స్థిర‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న‌త స్థితి ల‌భిస్తుంది. నూత‌న వ‌స్తు ప్రాప్తి, ధ‌న‌లాభం క‌లుగుతుంది. ఓర్పుతో వ్య‌వ‌హరించండి. అదృష్ట‌వంతులు అవుతారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ధైర్యంగా ప‌ని ప్రారంభించండి. క్ర‌మంగా స‌త్ఫ‌లితం వ‌స్తుంది. చంచ‌ల‌త్వం వ‌ద్దు. న‌మ్మ‌కంతో ముందుకు సాగండి. ఉద్యోగ ఫ‌లితం శుభ‌ప్ర‌దం. వ్యాపారంలో కొంత గంద‌ర‌గోళ స్థితి ఏర్ప‌డుతుంది. భూమి త‌త్సంబంధిత యోగాలుంటాయి. ప్ర‌య‌త్న బ‌లాన్ని బ‌ట్టి ల‌క్ష్య సిద్ధి ఉంటుంది. స‌రైన ప్ర‌ణాళిక‌తో ఉన్న‌త స్థితి ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అంతా మీరు కోరుకున్న‌ట్ట‌యితే జ‌రుగుతుంది. వ్యాపారం విశేష లాభాన్ని చేకూర్చుతుంది. ప‌ట్టుద‌ల‌తో గ‌మ్యాన్ని చేరాలి. ఉద్యోగంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అనుమానాల‌కు తావివ్వ‌వ‌ద్దు. గ‌ట్టి సంక‌ల్పంతో ప‌ని చేస్తే ప్ర‌శంస‌లు ఉంటాయి. అభిష్టం త్వ‌ర‌గా సిద్ధిస్తాయి. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

ముఖ్య‌మైన కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. అవ‌స‌రాల‌కు ధ‌నం అందుతుంది. ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌నుల్ని పూర్తి చేస్తారు. ఫ‌లితం కూడా ఊహించిన‌ట్టే ఉంటుంది. ధ‌ర్మ మార్గాన్ని అనుస‌రించండి. నింద‌లు మోపేవారు ఉంటారు. అపార్థాల‌కు తావివ్వ‌వ‌ద్దు. కోరిక‌లు ఒక్కొక్క‌టిగా నెర‌వేర‌తాయి.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగ ఫ‌లితం బ్ర‌హ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి గోచ‌రిస్తుంది. స‌మ‌య‌స్పూర్తి అవ‌స‌రం. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల విఘ్నాలు క‌లుగుతాయి. గ‌తానుభ‌వంతో వ్య‌వ‌హ‌రించాలి. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు అవ‌సరం. వ్యాపారంలో మిశ్ర‌మ కాలం న‌డుస్తోంది. మిత‌బాష‌ణం మంచిది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

 

అద్భుత‌మైన కాలం. అనేక విజ‌యాలున్నాయి. ధ‌ర్మ విచ‌క్ష‌ణ‌తో ప‌ని చేస్తే గొప్ప కార్య‌సిద్ధిని పొందుతారు. శాశ్వ‌తమైన కీర్తి ల‌భిస్తుంది. ధ‌న‌ధాన్య లాభం విశేషంగా ఉంటుంది. ఇంట్లో శుభాలు జ‌రుగుతాయి. ఉద్యోగంలో ఉత్త‌మ‌స్థితి గోచ‌రిస్తుంది. అధికారుల ప్ర‌శంస‌లు ఉంటాయి. కార్య‌సిద్ధి త్వ‌ర‌గా ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

 

ఉద్యోగంలో బాగుంటుంది. అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది. ఆప‌ద‌లు తొల‌గిపోతాయి. ఆశ‌యం నెర‌వేరుతుంది. సొంత నిర్ణ‌యం మేలు చేకూరుస్తుంది. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించండి. అవ‌కాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో మిశ్ర‌మ ఫ‌లితం గోచరిస్తోంది. వ్యయం పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

 

కాలం వ్య‌తిరేకంగా ఉంది. బుద్ధి బ‌లాన్ని ఉప‌యోగించి ప‌ని చేయాలి. లోతుగా ఆలోచించాలి. సంక‌ల్పం గ‌ట్టిగా ఉండాలి. స‌మిష్టి నిర్ణ‌యం మేలు చేస్తుంది. మంచి చేయ‌బోతే చెడు ఎదుర‌య్యే సూచ‌న‌లున్నాయి. ప‌రిస్థితులు క్ర‌మంగా స‌హ‌క‌రిస్తాయి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి అద్భుత‌మైన ఫ‌లితాన్ని అందుకునే కాల‌మిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. దేనికి భ‌య‌ప‌డ‌వ‌ద్దు. ధ‌ర్మం ముందుకు న‌డిపిస్తుంది. ఆవేశ‌ప‌రిచే వారు ఉన్నారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. వ్యాపార రిత్యా కాలం అనుకూలిస్తుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

అభిష్టాలు నెర‌వేరుతాయి. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. ప‌లు మార్గాల్లో క‌లిసి వ‌స్తుంది. ఉత్సాహంగా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకుంటారు. కార్య‌సిద్ధి విశేషంగా ఉంటుంది. ఆర్థిక లాభం ఉంది. పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. స్వ‌యంకృషితో పైకి వ‌స్తారు. కుటుంబ‌ప‌రంగా శ‌క్తి ల‌భిస్తుంది. అభిమానించేవారు ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  మీ గొంతులో క‌ఫం పేరుకుపోయిందా..? అయితే ఈ చిట్కాతో అద్భుత‌మైన ఫ‌లితం..!

Visitors Are Also Reading