Telugu News » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోండి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోండి

by Anji

రాశి ఫలాలు చదవడం వ‌ల్ల‌ ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ముందే తెలుసుకోవొచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Ads

Weekly Horoscope in Telugu 28.05.2022 నుండి 04.06.2022 వరకు

మేషం :

విశేష ప్రయత్నం తో అభీష్టం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్ష కాలంగా అనిపిస్తుంది. అప్రమత్తంగా ఉంటూ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి. ధన యోగం ఉంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. స్థిర నిర్ణయం మేలు చేస్తోంది.

Weekly Horoscope in Telugu: వృషభం 


ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. మంచి ప‌నులు చేప‌డుతారు. అనుకోని విఘ్నాలు ఎదురైనా ప్ర‌శాంత చిత్తంతో ప‌ని చేస్తే ఆటంకాలు త్వ‌ర‌గానే తొల‌గుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు సుదీర్ఘ‌కాలం పాటు స‌త్ఫ‌లితాన్నిస్తాయి. వ్యాపార‌, ఆర్థిక విష‌యాలు శుభ‌ప్ర‌దం.

Weekly Horoscope in Telugu : మిథునం

మ‌నోబ‌లం, ఏకాగ్ర‌చిత్తం కార్య‌సిద్ధిని ఇస్తాయి. నింద‌లు మోపే వారు ఉంటారు. సౌమ్యంగా స‌మాధాన‌మివ్వండి. తొంద‌ర వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఓర్పుతో వ్య‌వ‌హ‌రించాలి. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. బంధుమిత్రుల అభినంద‌న‌లు అందుకుంటారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కాలం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తోంది. ప్ర‌య‌త్నం ఎంత బ‌లంగా ఉంటే అంత ఉత్త‌మ ఫ‌లితాన్ని సాధిస్తారు. ప్ర‌తి అడుగు అభివృద్ధి వైపే వేయాలి. ఉద్యోగ వ్యాపారాలు లాభిస్తాయి. గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని అందుకుంటారు. నిస్వార్థంగా చేసే కార్యాలు తృప్తిని ఇస్తాయి. కుటుంబ ప‌రంగా శాంతి ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : సింహం

కోరిక‌లు నెర‌వేరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న‌ది సాధిస్తారు కీర్తి శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. ధ‌న లాభం ఉంటుంది. సంతృప్తిక‌ర‌మైన జీవితం ల‌భిస్తుంది. ప‌ది మందికి ఆద‌ర్శ ప్రాయులు అవుతారు. వ‌స్తులాభం సూచితం. ఈర్ష్యా ప‌రుల మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు. భ‌విష్య‌త్‌పై దృష్టి పెట్టండి.

Weekly Horoscope in Telugu : కన్య

అదృష్ట యోగం ఉంది. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రేష్ట‌మైన ఫ‌లితాలు ఉంటాయి. ధ‌న లాభం ఉంది. ప‌నుల‌ను వాయిదా వేయ‌కుండా స‌మ‌యానికి పూర్తి చేయాలి. కుటుంబ స‌భ్యుల సూచ‌న‌లు ప‌ని చేస్తాయి. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : తుల

క్ర‌మంగా అభివృద్ధిని సాధిస్తారు. విశేష ప్ర‌య‌త్నంతో మంచి విజ‌యం సొంతం అవుతుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి. ఆత్మ‌విశ్వాసం స‌డ‌ల‌కుండా చూసుకోవాలి. సొంత నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. మొహ‌మాటంతో రుణ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. స‌హ‌నం చాలా అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

దైవ‌బ‌లం ముందుకు న‌డిపిస్తుంది. ఉద్యోగంలో ల‌క్ష్యం నెర‌వేరుతుంది. స్వ‌ల్ప ప్ర‌య‌త్నంతోనే కార్యం సిద్ధిస్తుంది. మంచి మ‌న‌సుతో న‌లుగురికీ ఉపయోగ‌ప‌డే ప‌నులు చేప‌డుతారు. ద‌గ్గ‌రి వారి స‌ల‌హాలు తీసుకోవాలి. విశేష శుభ‌యోగాలున్నాయి. స‌ద్వినియోగం చేసుకునే స‌మ‌యం ఇది. నూత‌న వ‌స్తు, వాహ‌న లాభాలు సూచితం.

Weekly Horoscope in Telugu : ధనస్సు

దివ్య‌మైన కాలం న‌డుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు విశేష శుభాన్నిస్తాయి. తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతారు. ఉద్యోగంలో కోరుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. వ్యాపారం బాగుంటుంది. ఎటు చూసినా స‌త్ఫ‌లితాలే గోచ‌రిస్తున్నాయి. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకోండి. అదృష్ట‌వంతుల‌వుతారు.

Weekly Horoscope in Telugu : మకరం

ఈ వారం ఉత్సాహంగా ప్రారంభ‌మ‌వుతుంది. మంచి ప‌నుల‌తో ప్ర‌శంస‌లు పొందుతారు. ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోండి. బంగారు భ‌విష్య‌త్‌కు పునాదులు అవుతాయి. స్వ‌యం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ‌, వ్యాపారాలు బాగుంటాయి. సుఖ‌, సంతోషాలుంటాయి.

Weekly Horoscope in Telugu : కుంభం

సానుకూల ప‌రిస్థితులుంటాయి. స‌మ‌యానికి ప‌ని ప్రారంభించండి. శుభ‌యోగ‌ముంది. ఉప‌ద్ర‌వాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఉద్యోగంలో ప్ర‌శంసలుంటాయి. నూత‌న అవ‌కాశాలు వ‌స్తాయి. విశేష అభివృద్ధి క‌నిపిస్తోంది. త‌ల‌పెట్టిన కార్యాల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ వ‌ల్ల ప‌ది మందికి మేలు చేకూరుతుంది.

Weekly Horoscope in Telugu : మీనం

ప్ర‌య‌త్నం ఎంత బ‌లంగా ఫ‌లితం అంత ఉత్త‌మంగా ఉంటుంది. సంకోచించ‌కుండా నిర్ణ‌యాలు తీసుకోవాలి. వ్యాపారంలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. ఆవేశం ప‌నికి రాదు. మిత్ర భావ‌న మేలు చేస్తుంది. వారాంతంలో క‌లిసి వ‌స్తుంది. అంతా శుభ‌మే జ‌రుగుతుంది. ఇంట్లో శాంతి నెల‌కొంటుంది.


You may also like