Weekly Rasi Phalau in Telugu : రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 27.11.2022 నుంచి 03.12.2022 వరకు
మేషం :
Mesha
ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. మొహమాటంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శ్రమకు గుర్తింపు లభించేవిధంగా కృషి చేయండి. స్పష్టతతో పని చేసే లక్ష్యం సిద్ధిస్తుంది. పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.
Weekly Horoscope in Telugu: వృషభం
Weekly Rasi Phalau in Telugu
సంతృప్తిని ఇచ్చే ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచడం ఉత్తమం. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సంశయం పనికిరాదు. కొత్త వారి దగ్గర వీరు అసౌకర్యంగా ఉంటారు.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఉద్యోగ, వ్యాపారాలు అద్బుతంగా ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. భూ గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి కనిపిస్తుంది. సకాలంలో తీసుకునే నిర్ణయం అధిక లాభాన్ని ఇస్తుంది. భవిష్యత్ కి అవసరమైన నిర్ణయాలు తీసుకునే ఆసన్నమైంది. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
కాలాన్ని మీకు అనుకూలంగా సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్ కి బ్రహ్మాండమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపదలు తొలగిపోతాయి. బాంధవ్యాలు బలపడుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
తగిన మానవ ప్రయత్నం చేయండి. విజయం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలసట చెందకుండా పని చేసే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. వ్యాపారంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. వారం మధ్యలో సమస్య ఎదురవుతుంది. ఆత్మీయుల సూచనలు అవసరం.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
ఉద్యోగం బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం వరిస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి పని చేయాలి. భవిష్యత్ కి అవసరమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి. కలహాలకు తావు ఇవ్వకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి పని చేయండి.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
Thula
వ్యాపారంలో వివేష లాభాలు ఉంటాయి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. సంకోచం పనికి రాదు. ఓర్పు చాలా అవసరం. దగ్గరి వారితో ఆప్యాయంగా మాట్లాడండి. అపార్థాలకు తావివ్వకూడదు. ఆర్థికంగా బలపడుతారు. ఇతరులకు కాస్త ఇబ్బంది కలిగిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
మంచి ఉద్దేశంతో పని ప్రారంభిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. కాలం కలిసొస్తుంది. బంధువులు, స్నేహితుల సహాయ, సహకారాలు అందుతాయి. కుటుంబానికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆవేశ పరిచే వారు ఉన్నారు. పాత విషయాలు చర్చించకూడదు.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కృషిని బట్టి గుర్తింపు లభిస్తుంది. ఆశించింది దక్కుతుంది. ఒత్తిడి ఉన్నా సమర్థతతో బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతనంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం వల్ల విజయం వరిస్తుంది.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. వారం మధ్యలో మీరు ఓ శుభవార్త వింటారు. ముఖ్యంగా అందరితో కలవడానికి అంతగా ఆసక్తి చూపించరు.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. సంకోచించకుండా స్పష్టమైన ఆలోచనతో లక్ష్యాన్ని చేరాలి. సాంకేతిక లోపాలు జరుగనివ్వకూడదు. ఊహకు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహా చాలా అవసరం. పలు విధాలుగా అభివృద్ధి చెందుతారు.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
తలచిన కార్యక్రమాలు సఫలం అవుతాయి. మనోబలం, ఏకాగ్రత అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. వేధిస్తున్న సమస్య నుంచి బయటపడుతారు. ముందు, వెనుక ఆలోచించి నూతన కార్యాలను ప్రారంభించండి. పెద్దల సలహా చాలా అవసరం. ప్రయాణాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించండి.