రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 23.10.2022 నుండి 29.10.2022 వరకు
మేషం :
Mesha
వ్యాపార బలం బాగుంటుంది. పనిలో ఆజాగ్రత్త అస్సలు వద్దు. లక్ష్యంపై దృష్టి నిలిపి సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సంకోచం పనికిరాదు. సమిష్టి కృషితో అనుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా పని చేయాలి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసము మెండుగా ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. మీరు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలో స్పష్టత వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. సున్నితమైన అంశాలతో తొందరపడవద్దు. ఆవేషం ఇబ్బంది పెడుతుంది. శాంతంగా సకాలంలో పనులు పూర్తి చేయాలి.
Advertisement
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
కాలం అనుకూలిస్తుంది. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులపై ఆధారపడవద్దు. స్వయంకృషితోనే పైకి వస్తారు. సొంత నిర్ణయము మేలు చేస్తుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది. కాలాన్ని వృధా చేయకూడదు. ఉద్యోగంలో విశేషమైన మేలు జరుగుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మము మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎంపిక చేసుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. ధన, ధాన్య లాభం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
ధర్మబద్ధంగా పని ప్రారంభించండి. సాధనతోనే సమస్యని అర్థం చేసుకుని పరిష్కరించగలరు. చురుకైన ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయము పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహము ఉంటుంది.
Weekly Horoscope in Telugu : తుల
Thula
సకాలంలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఒత్తిడికి అసలు గురికావద్దు. ఎటు చూసినా ఆటంకమే గోచరిస్తుంది. గత అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో వారి సలహా చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. సత్ప్రవర్తనతో పెద్దలను మెప్పిస్తారు. వారాంతానికి శుభం జరుగుతుంది.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవచ్చు. మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే కోరుకున్న విధంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. కొందరి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అప్రమత్తంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. అదృష్టము కలిసి వస్తుంది.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ పని ఏ రోజు పూర్తి కావాలో ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. సునాయాసంగా విజ్ఞాలను అధిగమించగలుగుతారు.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
ఉద్యోగంలో అనుకున్నది జరుగుతుంది. విశేషమైన కృషి అవసరం. ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఒక సమస్య తొలగిపోతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన గుర్తింపును పొందుతారు. మిత్రుల వల్ల ఆపద తొలుగుతుంది. తొందరలో పొరపాటు జరగనివ్వకూడదు. శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మొహమాటం, అలసత్వము పనికిరావు.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
మంచి ఆలోచనలతో పని ప్రారంభించండి. శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కష్టపడాలి. ఉద్యోగంలో మీకు అధికారుల అండ లభిస్తుంది. సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో అధిక శాతం లాభపడతారు. భవిష్యత్ ప్రణాళిక బాగుంటుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది.