Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 20.11.2022 నుంచి 26.11.2022 వరకు

మేషం :

Mesha

Mesha

కీలకమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు మొహమాటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. కాలం వృథా చేయకూడదు. కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం ఉత్తమం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల అండదండలు చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉద్యోగంలో శుభ ఫలితం వస్తుంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. అధికార లాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ పరంగా బలం లభిస్తుంది. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. నిర్ణయాలు తరచూ మార్చవద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో అనుకున్న ఫలితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొరపాటు జరగనివ్వకూడదు. ధనయోగం సూచిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. విజయానికి చేరువవుతారు. కొన్ని నిర్ణయాలు మీ ప్రతిష్టను పెంచుతాయి. బంగారు భవిష్యత్  ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉత్సాహం పెరుగుతుంది.  తెలివి తేటలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఒక ప్రణాళిక ప్రకారం.. ముందుకు సాగండి. వ్యాపార లాభం ఉంటుంది. ఆదాయ మార్గాలను కాపాడుకుండి. ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత చాలా అవసరం. పని భారం పెరుగుతుంది. విశ్రాంతి అవసరం. ఒక సమస్య నుంచి బయటపడతారు.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

ఆత్మ విశ్వాసం గొప్పవారిని చేస్తుంది. ఆశయం నెరవేరుతుంది. అధికార లాభం చేకూరుతుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. దగ్గరి వారి సలహా శక్తిని ఇస్తుంది. అపార్థాలకు అవకాశమివ్వదు. ఆవేశపరిచే వారుంటారు. సౌమ్యంగా మాట్లాడాలి. వారాంతంలో ఆనందించే అంశాలుంటాయి.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

వ్యాపారంలో విజయం లభిస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. సకాలంలో పనులు ప్రారంభించండి. వాయిదా వేయకూడదు. భవిష్యత్ లో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఆవేశం అసలు పనికిరాదు. చంచల నిర్ణయంతో కాలం వృధా చేయకూడదు. ఆనందించే అంశాలున్నాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

మంచి భవిష్యత్ సొంతమవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంబిస్తే మీలోని శక్తి  తెలుస్తోంది. తిరుగులేని ఫలితం వస్తుంది. విజయాలు సొంతమవుతాయి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. ధనలాభం చేకూరుతుంది.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా పని చేయాలి. ఆత్మీయుల సూచనలు ఉపయోగపడుతాయి. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. నిజాయతీ మిమ్మల్నీ ఉన్నతులను చేస్తుంది. సందేహించవద్దు. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగుతాయి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితాలు త్వరగా లభిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించండి. తెలియని అంశాల్లో తలదూర్చకూడదు.  ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. వివాదాల్లో తలదూరకపోవడం మంచిది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగ ఫలితం చాలా ఉత్తమం. మంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభం పొందుతారు. వెతుకుతున్నది దొరుకుతుంది. కాలం సహకరిస్తుంది. అపోహలు తొలగుతాయి. గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. సకాలంలో స్పందించడం వల్ల మీ ద్వారా కొందరికీ మేలు చేకూరుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. ఆనందించే అంశాలుంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పలితాలు పొందుతారు.

Visitors Are Also Reading